Big Stories

Strange Fears : వింత భయాలు.. వేర్వేరు పేర్లు

Strange Fears

Strange fears : భయం అనేది మనిషి మనసులో కలిగే ఒక ఇబ్బందికరమైన భావన. అయితే.. భూమ్మీది మనుషులకు మారుతున్న పరిస్థితులను బట్టి వింత వింత భయాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆధునిక మానవుడికి ఇబ్బందిగా పరిణమిస్తున్న కొన్ని రకాల భయాలు, వాటి లక్షణాలు, వాటికున్న పేర్లు ఏమిటో తెలుసుకుందాం.

- Advertisement -

క్రోనోఫోబియా
వయసు పైబడుతోందనే దిగులు, జీవితంలో ఏమీ సాధించకుండా వెనకబడిపోయామనే బెంగ దీని లక్షణాలు. డిప్రెషన్‌తో బాధపడేవాళ్లలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పెద్దల నుంచి పిల్లలకు జన్యుపరంగా సంక్రమించే ప్రమాదం కూడా ఉంది.

- Advertisement -

ఎరిథ్రోఫోబియా
‘నేను పదిమందిలోకి వెళ్లినప్పుడు సిగ్గుపడతాను’ అనే భయాన్నే ఎరిథ్రోఫోబియా అంటారు. కొత్త మనుషుల్లోకి వెళ్లాలంటే ఆదుర్దా, వెళ్లినా మౌనంగా ఉండిపోవటం దీని లక్షణాలు. దీనివల్ల శరీరంలో అడ్రినలిన్‌ హార్మోన్ పెరిగి ముఖం, బుగ్గలు ఎర్రబడతాయి.

చిక్లెఫోబియా
బబుల్‌ గమ్‌ అంటే భయపడటాన్నే చిక్లెఫోబియా అంటారు. బబుల్‌‌ గమ్‌ నములుతున్న మనిషిని చూడగానే వీరి మనసులో కంగారు మొదలవుతుంది. వారిని చూసి చిరాకుపడటమూ ఉంటుంది. రోడ్డుమీద నమిలి పారేసిన చూయింగ్‌ గమ్‌పై వీరు పొరపాటున కాలేస్తే.. పామును తొక్కినట్లుగా ఫీలవుతారు. ప్రముఖ టీవీ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రేకు ఈ ఫోబియా ఉంది.

వెనుస్ట్రాఫోబియా
మహిళలను చూసి భయపడటాన్ని గైనోఫోబియాగా అంటారు. అయితే.. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే ‘వెనుస్ట్రాఫోబియా’ అంటారు. ఈ ఫోబియా ఉంటే.. అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చినా, దగ్గర్లో నిలబడినా, తమవైపు ఆ అమ్మాయి చూస్తున్నట్లు వీరు గమనించినా శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటం, చెమటలు పట్టటం వంటి లక్షణాలుంటాయి. వీరు తమ స్నేహితుల్లో అందంగా ఉన్నవారితో కలిసి ఉండేందుకు అసలు ఇష్టపడరు.

గామోఫోబియా
పెళ్లి చేసుకోవాలన్నా లేదా ఓ రిలేషన్‌షిప్‌లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. ఇలాంటివారు పొరబాటున ఎవరినైనా ప్రేమించినా, అవతలి వ్యక్తి పెళ్లి ప్రతిపాదన చేయగానే.. వారిమీద ద్వేషం పెంచుకుంటారు. క్రమంగా వారికి దూరమవటానికి ట్రై చేస్తారు.

జీనోఫోబియా
పరిచయం లేని కొత్త మనిషి, ఏలియన్లు అంటే కలిగే భయమే జీనోఫోబియా. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌‌ సైతం ఏలియన్స్ అంటే భయం ఉండేది. కూడా ఏలియన్లంటే భయపడేవారు.

సోమ్నిఫోబియా
నిద్రపోవాలంటే కలిగే భయాన్నే సోమ్నిఫోబియా అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కలలు వస్తాయన్న భయంతో కొందరు పిల్లలు పడుకోవటానికి వెనకాడుతుంటారు. అర్థరాత్రి వేళ భయంతో సడెన్‌గా నిద్రలేవటం, రొప్పుతూ మంచంమీద కూర్చోవటం దీని లక్షణాలు.
సైడెరోఫోబియా
నక్షత్రాలను చూస్తే కలిగే భయాన్నే సైడెరోఫోబియా అంటారు. వీరికి రాత్రిపూట తలెత్తి ఆకాశంవైపు చూడటం అంటే భయం. రాత్రిపూట ఆకాశం కనిపించకుండా వీరు కిటికీలు, కర్టెన్లు వేస్తుంటారు. వీరు నక్షత్రాలను చూస్తే స్పృహ కోల్పోవటం, చెమటలు పట్టటం, శ్వాస తీసుకోలేకపోవటం వంటి ఇబ్బందులపాలవుతారు.

వెస్టిఫోబియా
దుస్తులను చూసి భయపడటాన్ని వెస్టిఫోబియా అంటారు. దీని బాధితులు దుస్తులు వేసుకునేందుకు ఇష్టపడరు. తప్పక బట్టలు వేసుకుంటే.. ఎలర్జీ లక్షణాలతో బాధపడతారు.

ఫ్రోనెమోఫోబియా
ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి భయపడటం, తీవ్రంగా ఆందోళన చెందటం, వణకటం వంటి లక్షణాలుంటే ఆ మనిషికి ఫ్రోనెఫోబియా ఉందని అనుమానించాల్సిందే. ముఖ్యంగా గతంలోని చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలంటే భయపడేవారు దీని బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ.

ప్లూటోఫోబియా
డబ్బును చూసినా, ధనవంతులను చూసినా భయపడటాన్ని ప్లూటోఫోబియా అంటారు. వీరు తమ కెరియర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తూ.. పేదలుగా ఉండిపోతుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News