Big Stories

Bheemili Assembly Constituency : భీమిలిలో టీడీపీ-జనసేన కూటమి గాలి వీస్తోందా? ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా?

Bheemili Assembly Constituency : ఉత్తరాంధ్రలో అన్నిటికంటే హాట్ సీట్ ఏదైనా ఉందంటే అది భీమిలి సెగ్మెంటే. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 వరకు రెండు దశాబ్దాల పాటు భీమిలి సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటగా ఉంది. ఆ తర్వాత 2004లో వైఎస్ఆర్ హవాతో కాంగ్రెస్ గెలవగా, 2009లో చిరంజీవి వేవ్ ఉండటంతో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో టీడీపీ నుంచి భీమిలిలో గంటా శ్రీనివాసరావు విజయం సాధించగా, 2019లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ విక్టరీ కొట్టారు. చెప్పాలంటే అన్ని పార్టీలకు భీమిలి అవకాశం ఇచ్చింది. భీమిలిలో ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వం చుట్టూ టీడీపీలో రాజకీయ తిరుగుతోంది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఉద్దండులని ఓడించడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గంటా. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2014లో తిరిగి టీడీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు గంటా శ్రీనివాస్‌. ఇప్పుడు మరోసారి భీమిలిపై లుక్కేశారు. భీమిలి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

- Advertisement -

2019 ఎన్నికల ఫలితాలు

- Advertisement -

అవంతి శ్రీనివాస్ వైసీపీ (గెలుపు) VS సబ్బం హరి – టీడీపీ (ఓటమి)
YCP 44%
TDP 40%
JSP 11 %
OTHERS 5%

2019 ఎన్నికల్లో భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ 44 శాతం ఓట్ షేర్ తో విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరి 40 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. జనసేన నుంచి పోటీ చేసిన యువ నాయకుడు నాగ సందీప్ 11 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కాయి. మరి ఈసారి ఎన్నికల్లో భీమిలి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

అవంతి శ్రీనివాస్ ( YCP ) ప్లస్ పాయింట్స్

  • జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసిన అనుభవం
  • రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నాయకుడిగా పేరు
  • పార్టీ క్యాడర్ లో మంచి గుర్తింపు
  • జగన్ ప్రభుత్వ పథకాలపై ఆశలు

అవంతి శ్రీనివాస్ మైనస్ పాయింట్స్

  • భీమిలిలో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం
  • జనంలో నెగెటివ్ ఇమేజ్ పెరగడం
  • భీమిలి సెగ్మెంట్ లో రోడ్లు డెవలప్ కాకపోవడం
  • డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా లేకపోవడం
  • భీమిలిలో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేరకపోవడం
  • సెగ్మెంట్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకపోవడం

గంటా శ్రీనివాసరావు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • ఎక్కడ పోటీ చేసినా గెలిచేలా వ్యూహాలు
  • 2014లో భీమిలిలో గెలిచిన గంటా
  • టీడీపీ క్యాడర్ లో మంచి పట్టు ఉండడం

గంటా శ్రీనివాసరావు మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గాలు మార్చడం
  • గంటాకు టిక్కెట్ ఇస్తే రాజబాబు సపోర్ట్ చేస్తారా అన్న డౌట్లు

కోరాడ రాజాబాబు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అంటిపెట్టుకుని ఉండడం
  • భీమిలిలో టీడీపీ ఓడినా పార్టీ కార్యక్రమాల్లో కీలకం
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం
  • బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ నిర్వహణ
  • పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడం

కోరాడ రాజాబాబు మైనస్ పాయింట్స్

  • గంటా శ్రీనివాసరావు పోటీకి రావడం
  • టిక్కెట్ పై క్లారిటీ ఇవ్వకపోవడం
  • జనసేన పొత్తులో టిక్కెట్ ఆ పార్టీకే వెళ్తుందన్న ప్రచారం

పంచకర్ల నాగ సందీప్ ( JSP ) ప్లస్ పాయింట్స్

  • భీమిలిలో పంచకర్ల నాగ సందీప్ కు మంచి పేరు
  • గత ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసి 11% ఓట్లు రాబట్టడం
  • యువతలో నాగ సందీప్ కు మంచి ఫాలోయింగ్
  • నిర్విరామ పాదయాత్ర పేరుతో ఇంటింటికి వెళ్లిన సందీప్
  • జనసేన పార్టీ క్యాడర్ లో మంచి ఇమేజ్
  • అందరికీ అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం

పంచకర్ల నాగ సందీప్ మైనస్ పాయింట్స్

  • టీడీపీ జనసేన పొత్తులో టిక్కెట్ వస్తుందా లేదా అన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

అవంతి శ్రీనివాస్ VS కోరాడ రాజబాబు
YCP 42%
TDP 53%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు భీమిలి సెగ్మెంట్ లో ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవంతి శ్రీనివాస్ కు 42 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థి రాజబాబుకు 53 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. మొత్తంగా భీమిలిలో టీడీపీవైపు వేవ్ ఉన్నట్లుగా సర్వేలో ప్రజల అభిప్రాయంగా వెల్లడైంది.

అవంతి శ్రీనివాస్ vs గంటా శ్రీనివాసరావు
YCP 39%
TDP 57%
OTHERS 4%

ఇప్పటికిప్పుడు భీమిలిలో ఎన్నికలు జరిగితే.. ఎడ్జ్ టీడీపీవైపు కనిపిస్తోంది. అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు తలపడితే గురుశిష్యుల్లో విజయం గురువువైపే ఉండే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అవంతి శ్రీనివాస్ కు 39 శాతం ఓట్లు, గంటాకు 57 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిజానికి అవంతి శ్రీనివాస్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే గంటా శ్రీనివాసరావు. వీరిద్దరూ కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల్లో కలిసి పని చేశారు. గత ఎన్నికల టైంలో అవంతి చివరి క్షణంలో వైసీపీలోకి వెళ్లి భీమిలి టిక్కెట్ సాధించి గెలిచారు. అటు గంటా టీడీపీలో విశాఖ నార్త్ టిక్కెట్ తీసుకుని గెలిచారు. ఇప్పుడు గంటా భీమిలికి వస్తే గురుశిష్యుల యుద్ధం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అంతటా కనిపిస్తోంది.

అవంతి శ్రీనివాస్ VS పంచకర్ల నాగ సందీప్

YCP 41%
JSP 54%
OTHERS 5%

ఇక మరో సినారియో ప్రకారం భీమిలిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి పంచకర్ల నాగసందీప్ మధ్య పోటీ జరిగితే.. ఎడ్జ్ జనసేనవైపే కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి అవంతికి 41 శాతం ఓట్లు, జనసేన అభ్యర్థి నాగసందీప్ కు ఏకంగా 54 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News