Big Stories

Ambedkar :  అంబేద్కర్ గురించి మీకు తెలియని వాస్తవాలు ..!

Ambedkar : మనదేశంలో డా. బీ. ఆర్. అంబేద్కర్ అనే పేరు వినని మనిషి ఉంటాడంటే నమ్మలేము. అయితే.. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనలో చాలామందికి తెలియని కొన్ని విశేషాలను మీముందుకు తెస్తున్నాం. అవి..

- Advertisement -

అంబేద్కర్ ఈ భూమ్మీద జీవించింది.. కేవలం 65 ఏళ్లే. కానీ.. అందులో ఆయన 21 ఏళ్ల సమయాన్ని చదువుకోసమే కేటాయించారు. 64 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీలు, 9 భాషల్లో ప్రావీణ్యత ఆయన రికార్డుల్లో ఒకటి.

- Advertisement -

1935-36 సమయంలో ‘వెయిటింగ్ ఫర్ వీసా’ పేరుతో అంబేద్కర్ రాసిన పుస్తకాన్ని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ తన సిలబస్‌లో చేర్చింది.

‘ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు’ అనే అంశం ఆధారంగా లండన్ మ్యూజియంలో కారల్ మార్క్స్ విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహాన్నీ ప్రతిష్టించారు. 50 వేల పుస్తకాలతో కూడిన బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యక్తిగత లైబ్రరీ దేశంలోనే అతిపెద్ద పర్సనల్ లైబ్రరీగా గుర్తింపుపొందింది.

ప్రపంచంలో ఏ బుద్ధ విగ్రహాన్ని చూసినా.. కళ్లు మూసుకునే ఉంటుంది. కానీ.. అంబేద్కర్ ఇందుకు భిన్నంగా కళ్లు తెరచిన బుద్ధని బొమ్మను గీశారు. తద్వారా జ్ఞానం నిద్రపోదనే సందేశాన్నిచ్చారు. భారత దేశంలో అంటరానికులాల్లో తొలిసారి నల్లకోటు వేసుకొని కోర్టులో వాదించిన తొలి వ్యక్తి.. అంబేద్కర్.

ఆయన పూర్తి పేరు భీమరావ్ అంబా వాడేకర్. అయితే.. తొలిరోజు బడిలో టీచర్ ‘అంబా వాడేకర్’ను అంబేద్కర్ అని తప్పుగా రాయటంతో అదే కొనసాగింది. ప్రపంచం మొత్తంలో తాగునీటి మీద హక్కు కోసం.. సత్యాగ్రహానికి దిగిన ఏకైక నేత.. అంబేద్కర్.

అంబేద్కర్ మొదటి భార్య పేరు రమాబాయి. పెళ్లినాటికి ఆమెకు 14 ఏళ్లు. అనారోగ్యంతో తన 37వ ఏట ఆమె కన్నుమూశారు. తర్వాత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సవితను అంబేద్కర్ వివాహమాడారు. ఆమె 2003లో చనిపోయారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ ప్రదానం చేసే ‘డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్’ డాక్టరేట్ డిగ్రీని అందుకున్న తొలి, ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమే. 8 ఏళ్లు పట్టే ఆ డిగ్రీని ఆయన కేవలం 2 సంవత్సరాల మూడు నెలల్లోనే పొందారు. మన జాతీయపతాకంలో అశోక చక్రం పెట్టాలనే ప్రతిపాదన అంబేద్కర్‌దే. దానినే ఎందుకు పెట్టాలనే అంశాన్ని ఆయన రాజ్యాంగ సభలో వివరించి, అందిరి ఆమోదాన్ని పొందగలిగారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పుస్తకాలు, పాటల్లో అత్యధికం అంబేద్కర్ మీదనేనంటే నమ్మాల్సిందే. అంబేద్కర్‌కు పెంపుడు జంతువులంటే ప్రాణం. తొలిరోజుల్లో ఒక జింకను కూడా పెంచారు. ఇక.. ఆయన పెంపుడు కుక్క ‘టాబీ’ మరణించిప్పడైతే నెలల తరబడి దిగులుపడిపోయారు. టాల్‌స్టాయ్ ఆత్మకథ, విక్టర్ హ్యుగో రాసిన ‘లెస్ మిజరబుల్స్’, థామస్ హార్డీ రాసిన ‘ఫార్ ఫ్రమ్ మ్యాడీ క్రౌడ్’ అంబేద్కర్ ఆల్‌టైమ్ ఫేవరేట్ రచనలు.

న్యాయమంత్రిగా ఢిల్లీలోని పృధ్వీరాజ్ రోడ్డులో గల 22వ నంబరు భవనాన్ని అంబేద్కర్‌కు కేటాయించారు. దాన్ని చూద్దామని వెళ్లిన అంబేద్కర్‌కు.. అందులో దయ్యాలున్నాయనీ, అది ఏళ్ల తరబడి పాడుబడిందని దాన్ని పొరబాటున కూడా ఎంచుకోవద్దని అక్కడి సిబ్బంది, వాచ్‌మన్ చెప్పారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి చాలా దయ్యాలు, దుష్ట శక్తులతో పోరాడుతున్నా. ఇందులో ఉన్న దయ్యంతోనూ పోరాడతానులే’ అంటూ ఆ బిల్డింగ్‌నే ఎంచుకున్నారు. ఆ తర్వాత రోజూ వందల మంది సందర్శకులతో ఆ ఇల్లు ఏళ్ల తరబడి కళకళలాడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News