BigTV English

CM Nitish skips Niti Aayog meeting: నీతి ఆయోగ్ మీటింగ్.. సీఎం నితీష్ డ్రాప్, ఎన్డీయేలో ఏం జరుగుతోంది?

CM Nitish skips Niti Aayog meeting:  నీతి ఆయోగ్ మీటింగ్.. సీఎం నితీష్ డ్రాప్, ఎన్డీయేలో  ఏం జరుగుతోంది?

CM Nitish skips NITI Aayog meeting(Political news telugu): ఎన్డీఏలో ఏం జరుగుతోంది? కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా? బీహార్ సీఎం నితీష్‌కుమార్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ఎందుకు డుమ్మాకొట్టారు? ఇవే ప్రశ్న ఇటు ఎన్డీయే.. అటు ఇండియా కూటమిని  వెంటాడుతోంది.


న్యూఢిల్లీ వేదికగా శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా వికసిత్ భారత్-2047 విజన్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఏం జరిగిందో తెలీదుగానీ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ డ్రాపయ్యారు. బీహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా అటెండయ్యారు.

నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది.


నితీష్ సర్కార్‌ను విపక్ష ఆర్జేడీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సీఎం నితీష్‌కుమార్, ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖాదేవిపై విరుచుకు పడ్డారు. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. పరిస్థితి గమనించిన సీఎం నితీష్ కుమార్ అందుకే దూరంగా ఉన్నారన్నది కొందరి నేతల అభిప్రాయం.

ALSO READ: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

ఇండియా కూటమి నేతలు మాత్రం ఎన్డీయేలో నితీష్‌కుమార్ ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. బీహార్ ప్రజల నాడి తెలిసిన నితీష్‌కుమార్, పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతారని అంటున్నారు. ఈ విషయంలో ఆయనకు తిరుగులేదని చెబుతున్నారు. నిప్పులేనిదే పొగరాదని సీఎం నితీష్‌కుమార్ డ్రాప్ కావడం వెనుక కారణాలు చాలానే ఉంటాయని అంటున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×