Guava Fruit Juice Benefits: జామ పండ్లతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. జామపండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రతీ రోజూ జామకాయను పరిగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. మిగతా పండ్లతో పోలిస్తే జామ కాయలు ఆరోగ్యంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి.
జామపండులో ఉండే కాల్షియం, ఐరన్ శరీరానికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. జామ కాయలను కేవలం తినడమే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. జామకాయలోని విటమిన్ సీ, బీ3, బీ6 లు మెదడుకు రక్త ప్రసరణను ఇస్తాయి. నరాలకు విశ్రాంతినిచ్చి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతేకాదు జామకాయలో ఉండే ఇన్ఫ్లమేటరీ శ్వాసకోశ అలెర్జీలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం నరాలు, కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఒత్తిడితో పోరాడే వారికి జామపండు ఉపశమనం కలిగిస్తుంది.
జామకాయలో ఉండే రాగి థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. జామకాయ షుగర్ పేషెంట్లకు కూడా చక్కగా పనిచేస్తుంది. తరచూ ఉదయం పరిగడుపున జామకాయను తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా మేలు చేస్తుంది.
Also Read: బొప్పాయితో చర్మానికి అనేక ప్రయోజనాలు..
కడుపులో పెరుగుతున్న పిల్లల నరాల రుగ్మతల నుండి రక్షించడానికి తోడ్పడుతుంది. క్యాన్సర్ ముప్పు వంటి అనేక ప్రమాదాల నుంచి కూడా జామకాయ సహాయపడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా జామకాయ నియంత్రిస్తుంది. జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ, మలబద్ధకం వంటి అనేక సమస్యల నుంచి సహాయపడుతుంది.