BigTV English

Aloe Vera For Hair: అలోవెరా ఇలా వాడితే.. మీ జుట్టు విపరీతంగాపెరుగుతుంది తెలుసా ?

Aloe Vera For Hair: అలోవెరా ఇలా వాడితే.. మీ జుట్టు విపరీతంగాపెరుగుతుంది తెలుసా ?

Aloe Vera For Hair: సిల్కీ, పొడవాటి జుట్టు కోసం చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇది మాత్రమే మార్గం కాదు. ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ జుట్టును మృదువుగా, సిల్కీగా చేసుకోవచ్చు. ఇంటిలో ఉండే అలోవెరాతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి మీ జుట్టుకు పోషణ, తేమను అందిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా మారుస్తాయి. మరి ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎగ్ హెయిర్ మాస్క్: కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది జుట్టును పటిష్టంగా చేస్తుంది. జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది. అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును స్మూత్‌గా మారుస్తాయి.

ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
ఎగ్- 1
అలోవెరా జెల్- చిన్న కప్పు


అప్లై చేయు విధానం: ముందుగా ఎగ్ పగలగొట్టి గిన్నెలో వేయండి. బాగా మిక్స్ చేయండి తరువాత అలోవెరా జెల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. మీ జుట్టును క్యాప్‌తో కప్పి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో జుట్టు కడగాలి.

అరటితో హెయిర్ మాస్క్: అరటిపండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది.అరటితో చేసిన హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది.

ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
అరటిపండు- 1
అలోవెరా జెల్- 1 చిన్న కప్పు
తేనె- 4-5 స్పూన్లు

అప్లై చేయు విధానం: ముందుగా బాగా పండిన అరటిపండును మాష్ చేయండి. అందులో ఒక చెంచా తేనె కలపండి. తరువాత అలోవెరా జెల్ వేసి మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్న మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత చల్లటి వాష్ చేసుకోండి.

పెరుగుతో హెయిర్ మాస్క్: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీనిని తరుచుగా వాడితే తలలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి.

ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
పెరుగు- 1 కప్పు
అలోవెరా జెల్- చిన్న కప్పు

అప్లై చేయు విధానం: ముందుగా పైన చెప్పిన పదార్థాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. దీనిని తరుచుగా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి.

నిమ్మ రసంతో హెయిర్ మాస్క్: నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది.ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తుంది .

ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
నిమ్మరసం- 1 చిన్న కప్పు
అలోవెరా జెల్- 1 చిన్న కప్పు

అప్లై చేయు విధానం:పైన చెప్పిన మోతాదుల్లో నిమ్మరసంతో పాటు అలోవెరా జెల్ తీసుకుని ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత వాష్ చేసుకోవాలి.

Also Read: ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయ్

ఈ హెయిర్ మాస్క్‌ల నుండి మరింత ప్రయోజనం పొందడం ఎలా ?

ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించండి.

మాస్క్‌ను అప్లై చేసిన తర్వాత మీ జుట్టును ఎల్లప్పుడూ చల్లటి నీటితో కడగాలి. దుకంటే వేడి నీరు జుట్టునుపొడిగా మారుస్తుంది.

మీ జుట్టును మృదువుగా,మెరుస్తూ ఉండాలంటే తప్పకుండా కండీషనర్ ఉపయోగించండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×