BigTV English

Dharmana Prasada Rao: జగన్‌కు బిగ్ షాక్.. ధర్మాన చూపు.. జనసేన వైపు

Dharmana Prasada Rao: జగన్‌కు బిగ్ షాక్.. ధర్మాన చూపు.. జనసేన వైపు

ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన పేరు. అనేకసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో.. జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో.. ఆయనకు ప్రత్యేక క్యాడర్ ఉందనే పేరుంది. గెలుపు ఓటములు ప్రభావితం చేయగలిగే స్థాయిలో బలమైన నాయకత్వం ఉందని ఆ పార్టీ వర్గీయులే చెబుతుంటారు. భాషపై పట్టు..పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు చేయగల నేర్పరిగా ధర్మానకు పేరుంది. అలాంటి వ్యక్తి కుమారుడు మాత్రం.. రాజకీయాల్లో అంతగా రాణించలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి.

తన కుమారుడైన రామ్ మనోహర్ నాయుడికి.. ప్రసాదరావు సరైన బ్రేక్ ఇవ్వలేకపోతున్నారనే వాదన ఉంది. ఎన్నికల సమయంలో తండ్రికి.. చేదోడు వాదోడుగా ఉంటూ.. ప్రచారాల్లో పాల్గొనటం వరకే మనోహర్ ఉంటారట. ధర్మాన బిజీగా ఉన్న సమయాల్లో కార్యకర్తలతో మమేకం అవటం సహా వారికి సంబంధించిన కార్యక్రమాల్లో రామ్‌.. చురుగ్గా పాల్గొంటారని సొంత క్యాడర్‌లో పేరుంది. అయితే… రామ్‌ మనోహర్‌ నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేది తక్కువని ధర్మాన వర్గీయులే చెబుతున్నారు. ఇదే అసంతృప్తిని చాలా కాలం నుంచి కూడా ధర్మాన కూడా వ్యక్తం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉండి తనకు మాత్రం సరైన దారి చూపలేదని రామ్ మనోహర్ నాయడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.


గత ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు.. వైసీపీ అధినేతను కోరారని టాక్‌. దానికి అంగీకరించని జగన్‌…ధర్మాననే బరిలో దించారట. ఇదే విషయాన్ని ధర్మాన.. తన అనుచరులతో చాలాసార్లూ ప్రస్తావించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో తాను పోటీ చేయనని.. తన కుమారుడికి టికెట్ ఇమ్మని చెబితే… తననే పోటీలో ఉండాలని ఆదేశించారని ధర్మాన.. అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

పార్టీ అధినేత జగన్‌.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తి ధర్మానలో కూడా ఉందట. ఎన్నికల్లో ఓటమి, అనంతర పరిణామాల తర్వాత ప్రసాదరావు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారట. వైసీపీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదని సొంత పార్టీలోనే చర్చ సాగుతోందట. మరోవైపు.. వైసీపీ శ్రీకాకుళం నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రస్తుతానికి ఎవరూ లేరట. ఇన్‌ఛార్జ్‌ కోసం అనేక మంది పేర్లు వినిపిస్తున్నా.. అందులో రామ్ మనోహర్ నాయడు పేరు వినిపించకపోవటంతో.. అసంతృప్తి ఎక్కువ అయ్యిందనే వాదనలు ఉన్నాయి. నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కుడా దక్కకపోతే.. మనోహర్‌కు ఫ్యాన్ పార్టీలో రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చ జోరుగా సాగుతోందట. ఇలా అయితే కష్టమని ధర్మాన వర్గీయులు కూడా చర్చించుకోవటం హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: తుమ్మల దెబ్బ.. ఖమ్మం నుండి పువ్వాడ జంప్

మరోవైపు.. ధర్మాన ప్రసాదరావు వైసీపీని వీడతారనే వాదన ఒకవైపు ఉండగా.. రామ్ మనోహర్‌నాయుడు జనసేనలో చేరతారనే టాక్ వినిపిస్తోందట.వైసీపీ కూడా గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం.. జిల్లాలో పార్టీ భవితవ్యం అమోయమంలో ఉండటంతో..రామ్ పార్టీ మార్పు తథ్యమనే ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయట. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే.. అతనికి రాజకీయ భవిష్యత్ ఉండదనే కోణంలో ధర్మాన వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రసాదరావు కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ నిర్ణయాన్ని అతని అభిప్రాయానికే వదిలేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సొంత క్యాడర్‌లోనూ చర్చసాగుతోందట. తండ్రి వైసీపీకు దూరం అయితే.. రామ్ మనోహర్ అదే పార్టీలో ఎదిగే అవకాశం లేనందున.. పార్టీ మార్పు తప్పదని రాజకీయ నిపుణులు కూడా చర్చించుకుంటున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడి ప్రకారం… తన రాజకీయ భవిష్యత్‌ కోసం రామ్‌ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ ఉన్న పార్టీ వైపు అడుగులు వేస్తారని ప్రచారం సిక్కోలు జిల్లాలో జోరుగా సాగుతోందట.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చాలామందీ తెలుగుదేశం, జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇదే అంశంపై తన సన్నిహితులతో రామ్ మనోహర్‌నాయుడు కూడా చర్చలు జరిపారట. వైసీపీ ఉంటే కలిగే ప్రయోజనం.. వీడితే వచ్చే ఫలితాలపై బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ, జనసేనలోని ఏదో ఒక పార్టీలో చేరితే తగిన గౌరవం దక్కుతుందనే యోచనలో రామ్ ఉన్నారట. అయితే.. ఎక్కువ మంది సన్నిహితులు మాత్రం జనసేన అయితేనే బెటర్ అని సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి.. ధర్మాన ప్రసాదరావు కుమారుడు జనసేన వైవు వెళతారనే చర్చ.. జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న తండ్రి నిర్ణయం కోసం రామ్‌ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ధర్మానకు మించిన గైడ్‌.. ఫిలాసఫర్ ఇంకొకరు ఉండరు కాబట్టి ఆయన సలహా తీసుకునే.. ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారట. కాబట్టి త్వరలోనే రామ్ మనోహర్‌ నాయుడు.. ఓ నిర్ణయానికి వస్తారని.. ఆయన అనుచరులే చెప్పుకుంటున్నట్లు సమాచారం.

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×