EPAPER

Bharat Jagruthi: ‘జాగృతి’ జాడేది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయ్?

Bharat Jagruthi: ‘జాగృతి’ జాడేది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయ్?

Kavitha: భారత్‌ జాగృతి… బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పడి.. తర్వాత కాలంలో ఉద్యమం దిశగా సాగిన వ్యవస్థ. కేసీఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలో ఆరంభంలో బాగానే నడిచినా.. క్రమేపీ జాగృతి కార్యకలాపాల వేగం తగ్గిందనే చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత పేరు చేర్చిన నాటి నుంచి తెలంగాణలో ఈ మాటే దాదాపు కనుమరుగు అయ్యిందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జాగృతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందట.


భారతీయ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థగా పేరు తెచ్చుకున్న భారత్ జాగృతిని కేసీఆర్ కుమార్తె కవిత ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతానికి అత్యంత కీలకమైన బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ప్రారంభమైన జాగృతి.. తర్వాత కాలంలో అనేక సభలూ.. సమావేశాలు నిర్వహించింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కవిత ఉండి.. అన్నీ తానై నడిపించారు. ఇక్కడవరకూ ఓకే.. కానీ.. ఇటీవల కాలంలో ఆమె జైలుపాలు కావటంతో.. జాగృతి భవితవ్యం ఏంటని చర్చ జోరుగా సాగిందట.

భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత… రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ జాగృతి కమిటీలను మార్చి 10న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు కూడా. జాగృతి కమిటీలు రద్దు చేసి.. సుమారు ఏడు నెలలు దాటినా… నూతన కమిటీలపై ఆమె దృష్టి సారించడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కవిత.. చాలాకాలం జైలు జీవితాన్ని గడిపారు. ఒకానొక సమయంలో ఆమెకు బెయిల్‌ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు తెలంగాణలో అధికారం కోల్పోవటం, మరోవైపు కుమార్తె జైలు పాలవటంతో కేసీఆర్‌.. ఉక్కిరిబిక్కిరి అయ్యారు.


దేశరాజకీయాల్లోనూ చక్రం తిప్పుతానని శపథం చేసిన కేసీఆర్‌… ప్రస్తుతం ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త కమిటీల మాటెలా ఉన్నా.. జాగృతి ఉంటుందా లేదా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. 2006 ఆగస్టులో భారత్‌ జాగృతిని కవిత ఏర్పాటు చేశారు. తర్వాత ఏడాది అంటే 2007 నవంబర్ నుంచి జాగృతి ఆధ్వర్వంలో కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమ్యాయి. బతుకమ్మ పండుగను అన్ని తామై జాగృతి సభ్యులు ముందుండి నడిపించారనే వాదన ఉంది.

2014లో BRS అధికారంలోకి వచ్చిన తరువాత పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని… జాగృతి కొనసాగించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేసి తమ పరిధిని పెంచుకోవటంపై కవిత దృష్టి సారించారు. ఏమైందో… ఏమో….BRS పార్టీ అధికారం కోల్పోయిన తరువాత జాగృతి కమిటీలు రద్దు చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదల అయిన కవిత.. జాగృతి నూతన కమిటీలపైన దృష్టి సారిస్తారని అందరూ భావించారు. తీరా చూస్తే.. ఆమె పూర్తిస్థాయి విశ్రాంతికే పరిమితం అయ్యారట. నూతన కమిటీల ఊసే లేకపోవటంతో.. జాగృతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో జాగృతి కమిటీల్లో ఉన్నవారు.. ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. కమిటీలు రద్దు అయ్యి నెలలు గడుస్తున్నా.. నూతన కమిటీలపై దృష్టి పెట్టకపోవడం, ఎవరికీ ఆమె అందుబాటులోకి రాకపోవడంపై.. గతంలో జాగృతి కమిటీలో ఉన్నవారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. భారత్‌ జాగృతి.. నూతన కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని చర్చ.. తెలంగాణ వ్యాప్తంగా సాగుతోందట. గతంలో యాక్టివ్‌గా ఉండి అన్నీ తానై నడిపించిన కవిత.. కేసులో ఇరుక్కోవటంతో సమయం లేక ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారట. ఆమె బయటకు వచ్చాక.. మళ్లీ భారత్‌ జాగృతిపై దృష్టి సారిస్తారని అంతా భావించారు. కానీ.. కవిత మాత్రం తాను విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించటంతో ఓ రకంగా జాగృతి సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. దీపావళి తర్వాత ఆమె జాగృతి కార్యకలాపాలపై దృష్టి సారిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి.. నూతన కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ సమయంలో ఏర్పాటు చేశారు కాబట్టి.. అధికారం కోల్పోగానే ఎలా రద్దు చేస్తారని.. అందులోని సభ్యులే చర్చించుకుంటున్నారట. అసలు జాగృతి కమిటీలు రద్దు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది.

Also Read: 7 రోజుల్లో సారీ చెప్పాలి.. రివర్స్ షాకిచ్చిన బండి సంజయ్.. కేటీఆర్ రిప్లై ఎలా ఉండెనో?

మరోవైపు.. జాగృతి రన్ అవుతున్న సమయంలోనే పెద్ద మొత్తంలో జాగృతి ఫండ్ వసూల్ చేశారని ఆరోపణలున్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాటిని ఎటువైపు మళ్లించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. కమిటీల ఏర్పాటు మాటెలా ఉన్నా.. వసూలైన ఎమౌంట్‌కు లెక్కాపత్రాల సంగతేంటని కొందరు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన కవిత… కొన్ని రోజుల నుంచి పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె దీపావళి పండుగ తర్వాత యాక్టివ్ అవుతారని ఆమె వర్గీయులు చెబుతున్నారట. కొత్త కమిటీల ఏర్పాటుతో పాటు పాత ఫండింగ్‌ విషయంలో తలెత్తిన ప్రశ్నలకు కవిత ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి.

Related News

Srinivas Goud In Trouble: కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ మాజీ మంత్రి అరెస్ట్ తప్పదా?

Kamala Harris Vs Trump: మనోళ్లు.. కమల వైపా? ట్రంప్ వైపా?

TDP vs Janasena: దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన.. తప్పెవరిదంటే..

KTR in Confusion: కేటీఆర్ క్లారిటీ మిస్సమవుతున్నారా? కేసీఆర్ గురించి తటపటాయింపెందుకు?

Nara Lokesh: వైసీపీలో లోకేష్ టెన్షన్.. జైలుకి వెళ్లేది వీళ్లేనా?

Tension in Nellimarla: నెల్లమర్లలో టెన్షన్.. టీడీపీ వర్సెస్ జనసేన

TDP VS Janasena: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

Big Stories

×