BigTV English

Allu Arjun – Ram Charan : ఏంటి రామ్ చరణ్.. మా అన్నను కాపీ కొట్టావా.. ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..

Allu Arjun – Ram Charan : ఏంటి రామ్ చరణ్.. మా అన్నను కాపీ కొట్టావా.. ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేసాయి. మొన్న రిలీజ్ అయిన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటుగా యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టాయి. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి దీపావళి సర్ ప్రైజ్ ను ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇక ఫ్యాన్స్ కు ఊహించినట్లే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. ఈ మూవీ నుంచి రామ్ చరణ్ మాస్ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు. అది ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించినా కూడా ట్రోల్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా ఈ పోస్టర్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


గేమ్ ఛేంజర్ పోస్టర్.. 

నిన్న దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్ లో అదరగొట్టాడు. పట్టాలపై విలన్ మనుషులని రామ్ చరణ్ కొట్టి పడినట్టు తెలుస్తుంది. చరణ్ మాస్ లుక్ లో లుంగీ కట్టి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. ఆ పోస్టర్ వైరల్ అవ్వడంతో ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ దీనిపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు..


అల్లు అర్జున్ – రామ్ చరణ్.. 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ లుక్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే.. మాస్ లుక్ లో బన్నీ సూపర్ గా ఉన్నాడు. ఆయన లుక్ పై ఫ్యాన్స్ ఎంతగా సంబరపడిపోయారు. మా హీరో లుంగీ కడితే మిగితా హీరోలు పారిపోవాలి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి దీపావళి సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చరణ్ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ లుంగీ కట్టడం, ఫైట్స్ అంతా పుష్ప లుక్ లాగా ఉండటం తో మా అన్నను కాపీ కొట్టారా? మీకు అస్సలు సెట్ కాలేదు.. అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక పుష్ప 2 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×