Chalivendram :- వైశాఖ మాసంలో ప్రతీ రోజు మంచిరోజే. విష్ణుమూర్తిగా ఇష్టమైన మాసం. దక్షిణాయనంలో కార్తీకం, ఉత్తరాయణంలో మాఘ, వైశాఖ మాసాలు ప్రత్యేకమైనవి. మాధవుడికి ఇష్టమైన మాసం కాబట్టే దీన్ని మాధవమాసం అంటారు. వసంతఋతువులో రెండో మాసమే వైశాఖం. ఈ మాసంలో ధాన ధర్మాలు చేస్తే పరలోకంలో మోక్షం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతీరోజు తప్పనిసరిగా శ్రీమనారాయణుని తులసితో ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఆ పరమాత్ముడికి కృష్ణ తులసి సమర్పిస్తే ఉత్తమం అని ధర్మశాస్త్రంలో ప్రస్తావించింది.
ఉత్తరాయణంలో మాఘ, వైశాఖ మాసాలు, దక్షిణాయనంలో కార్తీకానికి,ప్రత్యేకమైనవి. గంగాస్నానం, విష్ణుమూర్తి ఆరాధన, దానాలు వైశాఖ మాసంలో చేయాల్సిన పనులు. నీటి కుండలు దానం చేసినా మంచిదే. అందుకే చలివేంద్రాల్లో కుండల్లో నీళ్లు పోసి జలప్రసాదాన్ని అందిస్తుంటారు. పైగా దాహం వేసివానికి దాహార్తి తీర్చితే కలిగేది పుణ్యమే. తాగడానికి నీళ్లు లేవని చెప్పకూడదని కూడా అంటారు అందుకే. ఈ మాసంలో శివుడి అభిషేకం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శివపూజతో శాంతి లభిస్తుంది. శివాలయాలలో శివునకు దారాపాత్రను ఏర్పాటు చేస్తే అరిష్టాలు, కష్టాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఈ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరించడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి. వేసవి వేడితో అల్లాడిపోతుంటారు. అలాంటి వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం చేస్తే దేవుడి కృప కలుగుతుంది. అందుకే ప్రత్యేకంగా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలతో పుణ్యం పురుషార్దం కలుగుతాయంటోది శాస్త్రం. వైశాఖమాసంలో నదీ స్నానం ఆచరించాలి. కుదరకపోతే పుణ్యనదుల్ని స్మరించుకుంటూ ఇంట్లో స్నానం చేయచ్చు.