BigTV English

Poco F7 Poco F7 Pro : పోకో నా మజాకా.. కిర్రాక్ ఫీచర్స్ తో మరో రెండు ఫోన్స్ లాంఛ్.. కెమెరా ఫీచర్స్ అదిరిపోయాయంతే!

Poco F7 Poco F7 Pro : పోకో నా మజాకా.. కిర్రాక్ ఫీచర్స్ తో మరో రెండు ఫోన్స్ లాంఛ్.. కెమెరా ఫీచర్స్ అదిరిపోయాయంతే!

Poco F7 Poco F7 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో… ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేస్తుంది. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో వచ్చే ఈ మొబైల్స్ కోసం కస్టమర్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తారు. ఈ మొబైల్ లాంఛ్ అయిన వెంటనే హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయి. ఇక మొదటి నుంచి పోకో మొబైల్ కెమెరాలో టాప్ క్వాలిటీగా ఉంటూనే వస్తుంది. తాజాగా ఈ కంపెనీ మరో రెండు మొబైల్స్ ను అదిరిపోయే కెమెరా క్వాలిటీతో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.


పోకో తాజాగా రెండు మొబైల్స్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మొబైల్స్ ను చైనాలో లాంఛ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక Redmi K80, Redmi K80 Pro మెుబైల్స్ కు రీ బ్రాండ్ గా ఈ ఫోన్స్ రానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Poco F7 ప్రో, Poco F7 పేరుతో రాబోతున్న ఈ మెుబైల్స్ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయండి.

Poco F7 Pro –


Poco F7 Pro “Zorn” అనే కోడ్ నేమ్‌తో Snapdragon 8 Gen 3 SoC చిప్ సెట్ తో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.67 అంగుళాల 2K OLED డిస్‌ప్లే, Android 15 ఆధారిత HyperOS 2.0 తో పని చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్ – ఈ మెుబైల్ లో అల్ట్రా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ OVX8000 సెన్సార్ తో రాబోతుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ S5KJN5 టెలిఫోటో షూటర్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ S5KKD1 సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ OV20B40ను కలిగి ఉండనుంది.

Poco F7 –

Poco F7 మెుబైల్ Miro అనే కోడ్ తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, TCL డిస్ ప్లే ప్యానెల్‌తో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.67 అంగుళాల 2K OLED డిస్‌ప్లే ఇందులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక Android 15 ఆధారిత HyperOS 2.0 తో పని చేయనున్నట్లు తెలుస్తుంది. పోకో ఎఫ్7 ప్రో లో ఉన్నట్లే ఇందులో కూడా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. Poco F7 Pro మాదిరిలాగే ఇందులో సైతం కెమెరా క్వాలిటీ బెస్ట్ గానే ఉంటుందని, కెమెరా స్పెసిఫికేషన్స్ అదిరిపోయేటట్టు ఉంటాయని తెలుస్తోంది.

ఈ మొబైల్స్ కి ఫీచర్స్ ప్రస్తుతానికి లీక్ అయినప్పటికీ ఈ మొబైల్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న విషయం మాత్రం పోకో తెలపలేదు. ఇక ఈ మొబైల్స్ ధరను సైతం తెలిపలేదు. త్వరలోనే ఈ మొబైల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని, అందుబాటు ధరల్లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని మాత్రం టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : OTTని షేక్ చేసే బెస్ట్ జియో ప్లాన్స్ ఇవే… ఏ ధరకు ఏ ఫ్లాట్మామ్స్ అంటే!

 

 

Related News

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Oppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

Big Stories

×