BigTV English
Advertisement

Jawan: జవాన్ రిలీజ్ డేట్ మారింది.. ప్రకటించిన నిర్మాతలు

Jawan: జవాన్ రిలీజ్ డేట్ మారింది.. ప్రకటించిన నిర్మాతలు
Jawan

Jawan : ఈ ఏడాది జ‌న‌వ‌రి ప‌ఠాన్‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌. ఇప్పుడు మళ్లీ ‘జవాన్’గా ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ష‌న్‌లో జ‌వాన్ సినిమా రూపొందుతోంది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘జవాన్’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అందులో డిఫరెంట్ మాస్క్ ధ‌రించిన హీరో ప‌దునైన ఈటెను ప‌ట్టుకున్నాడు. పోస్ట‌ర్‌ను గ‌మనిస్తుంటే మ‌రోసారి షారూఖ్ మాస్ అండ్ ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్‌తో ఆక‌ట్టుకోనున్నార‌ని తెలుస్తోంది.


షారూఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి విలన్‌గా న‌టిస్తున్నారు. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ అనిరుద్ ర‌విచందర్ సంగీతం స‌మ‌కూరుస్తోన్న‌ ఈ చిత్రానికి జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే సినిమా ఇంకా పూర్తి కావటానికి సమయం పట్టేలా ఉండటంతో సినిమాను సెప్టెంబర్ 7కి వాయిదా వేశారు. పఠాన్ స్టైల్లోనే జవాన్ సినిమాను కూడా మేకర్స్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు మరి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×