Big Stories

carrot : కేరట్‌తో ఎలర్జీలు దూరం

Allergies away with carrot

carrot : శీతాకాలంలో ఎలర్జీలను, రక్తహీనతను దూరం చేసే రూట్ వెజిటబుల్ కేరట్. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. పోషకాలైన బీటా కెరోటిన్(శరీరంలో విటమిన్ ఏగా మారేది), ఫైబర్, విటమిన్ కే1, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లో-కేలరీ, లో-ఫాట్ ఫుడ్ కూడా. అందుకే కేరట్‌ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచిదని డైటీషియన్లు చెబుతుంటారు.

- Advertisement -

ముడి కేరట్లలో ఉండే పోషకాల్లో అత్యధిక భాగం శరీరానికి అందేలా చూడాలంటే కేరట్ జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. అయితే జ్యూస్ వల్ల కేరట్లలోని ఫైబర్ కంటెంట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. జీర్ణక్రియను పెంపొందించడంలో ఫైబర్ కీలకం. బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణకూ ముఖ్యమే. సో.. కేరట్ జ్యూస్‌‌కు మొగ్గు చూపేవారు.. దాంతో పాటు సమతులాహారం తీసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

బ్రేక్‌ఫాస్ట్‌లో కేరట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బీటా కెరోటిన్ విటమిన్ ఏ గా మారి శరీరానికి సమృద్ధంగా అందుతుంది. దీని వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కేరట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ వంటి పోషకాల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతమవుతుంది. ఇన్ఫెక్షన్లపై సమర్థంగా పోరాడే శక్తి లభిస్తుంది.

కేరట్‌లోని పొటాషియం, విటమిన్-కే వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల హృద్రోగ సమస్యలు తగ్గుతాయి. కేరట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

కేరట్‌లోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం లేకుండా చూస్తుంది. ఉదరకోశ వ్యాధులను తగ్గించడంలో ఎంతో దోహదపడుతుంది. కేరట్ జ్యూస్ నేచురల్ డీటాక్సిఫయిర్గా పనిచేస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేయడమే కాకుండా.. అది సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.

కేరట్ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఈ.. మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాదు మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తుంది. పళ్లు, దంత ఆరోగ్యానికి కేరట్‌లోని పొటాషియం, కాల్షియం ఎంతో మేలు.

కేరట్ జ్యూస్‌లో కేలరీలు తక్కువ.బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ వే. ఊపిరితిత్తులు, కోలన్, బ్రెస్ట్ కేన్సర్ల వంటి వాటి నుంచి కేరట్ రక్షణ కల్పిస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిండెట్లదే కీలకపాత్ర.

రోజూ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గ్లాసు కేరట్ జ్యూస్ తీసుకుంటే మంచిది. స్మూతీల కోసం కేరట్ ఉపయోగించవచ్చు. ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే నిత్యం ఆహారంలో కేరట్ ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News