BigTV English

Ajay Jadeja : ట్రెండింగ్ లో ఒకనాటి అజయ్ జడేజా.. టీమ్ ఇండియాపై విమర్శలు.. సెటైర్లు..

Ajay Jadeja : ట్రెండింగ్ లో ఒకనాటి అజయ్ జడేజా.. టీమ్ ఇండియాపై విమర్శలు.. సెటైర్లు..
Ajay Jadeja

Ajay Jadeja : 1992-2000 కాలంలో ఇండియన్ టీమ్ లో అజయ్ జడేజా జమానా అని చెప్పాలి. ఇప్పుడు టీ20 ఆటను ఆనాడే అందరికీ రుచి చూపించాడు. అయితే అనూహ్యంగా అతని కెరీర్ మసకబారిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదేళ్లు నిషేధం విధించింది. అయితే దీనిపై కోర్టులో కేసు వేసి విజయం సాధించాడు. కానీ ఆట గాడి తప్పినా, రకరకాల పాత్రల్లో మెప్పిస్తున్నాడు.


ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ జట్టు మెంటర్ గా ఉన్నాడు. వరల్డ్ కప్ లో ఆఫ్గనిస్తాన్ తన మార్గదర్శకత్వంలోనే ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించింది. దీంతో తను మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు టీమ్ ఇండియా నిర్ణయాలపై విమర్శలు సంధిస్తున్నాడు.

ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో ఇషాన్ కిషన్ పై ప్రేమ చూపించాడు. తనలో అద్భుతమైన ప్రతిభ ఉందని అన్నాడు. ఇప్పటికే డబుల్ సెంచరీ చేసిన తనని పక్కన పెట్టడం అన్యాయమని అన్నాడు. వరల్డ్ కప్ కి ఎంపిక చేశారు. గిల్ వచ్చిన తర్వాత అవకాశాలివ్వలేదని అన్నాడు. ఆసిస్ తో జరిగిన మ్యాచ్ ల్లో 2 ఆఫ్ సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు.


మంచి ఆటగాళ్లకి అవకాశాలు తరచూ ఇవ్వకపోతే  ఒత్తిడితో కూడిన అంతర్జాతీయ మ్యాచ్ ల్లో విజయం సాధించడం కష్టమని అన్నాడు. ఇషాన్ కిషన్ మాత్రం తనదైన రోజున మ్యాచ్ విన్నర్ గా మారుతాడని కితాబుని చ్చాడు.

ఇది జరిగిన వారం రోజులకి, ఇప్పుడు హార్దిక్ పాండ్యా విషయంలో సెటైర్లు వేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాండ్యాపై వచ్చిన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పాడు. నాకు తెలిసి పాండ్యాలో అరుదైన టాలెంట్ ఉంది. కానీ గ్రౌండ్ లో కన్నా, ఇంటిలోనే ఎక్కువ రెస్ట్ తీసుకుంటాడని తెలిపాడు. అంటే తన ఉద్దేశం ఎప్పుడూ గాయాలపాలవుతూ ఉంటాడని సెటైరికల్ గా చెప్పుకొచ్చాడు.

దెబ్బలు తగలకుండా ఫీల్డింగ్ చేయడం తదితర విన్యాసాలను హార్దిక్ పాండ్యాకు తెలిసినప్పటికి, ఆటలోకి వెళ్లిన తర్వాత తన కెరీర్ ని పణంగా పెట్టి ఫీల్డింగ్ చేస్తుంటాడు, ప్రమాదకర బాల్స్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడు, అందరి క్రికెటర్లలా ఆడే తెలివితేటలు తనకి లేవు.. అని నెటిజన్లు పాండ్యాలోని గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×