BigTV English

AP Debts: ఏపీ అప్పులు.. దాచే తిప్పలు!.. ఎవరి మాటేంటి?

AP Debts: ఏపీ అప్పులు.. దాచే తిప్పలు!.. ఎవరి మాటేంటి?

ఇది అధికారపక్షం చెబుతున్న మాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీ అప్పులు అక్షరాలా 9.74 లక్షల కోట్లుగా ఉంది. 3 లక్షలున్న అప్పులు.. 9 లక్షల వరకు చేరాయి.  ఏడాదికి లక్షా 20 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు జగన్‌ అంటున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు.. అనేక అక్రమాల ద్వారా భారీగా ఆదాయం కోల్పోయామని.. వాటి లెక్కలను కూడా చెప్పేశారు ఆయన. ఇసుక అక్రమాల ద్వారా 7 వేల కోట్ల నష్టం.. గనుల దోపిడి ద్వారా 9 వేల 750 కోట్లు..మొత్తంగా 9 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అప్పు..
అంటే ఒక్కొక్కరిపైన తలసరి అప్పు లక్షా 44 వేల రూపాయలు అన్నట్టు.. అంతేకాదు అప్పులు తీసుకురావడానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. మద్యం అమ్మకాలపైనా కూడా అప్పులు తీసుకొచ్చారు. ఇలా సాగిపోయింది చంద్రబాబు ప్రసంగం.

మరి ఏది నిజం? ఏపీ అసలు అప్పెంత? మాజీ సీఎం జగన్‌ చెబుతున్నట్టు 5 లక్షల కోట్లా..? ప్రస్తుత సీఎం చంద్రబాబు చెబుతున్న 9 లక్షల కోట్లా? ఇద్దరి లెక్కల మధ్య 4 లక్షల కోట్ల తేడా ఉంది. ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజలకు సంబంధించిన వ్యవహారం.. పాలనకు సంబంధించిన వ్యవహారం.. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం అస్సలు మంచిది కాదు. నిజానికి జగన్‌ సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా అప్పులు చేశారంటూ టీడీపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ వచ్చింది. నిజానికి ఏపీ అప్పులు కూడా పెరుగుతూ వచ్చాయి. అంతేకాదు వైసీపీ హయాంలో ఆదాయాన్ని పెంచే మార్గాలను చూడలేదని. జస్ట్ సంక్షేమ పథకాల అమలుపై మాత్రమే ఫోకస్ చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలను చూస్తే ఇదే నిజమనిపిస్తోంది కూడా.. అంతేకాదు చాలా రంగాలను నిర్లక్ష్యం చేశారని కూడా తెలుస్తోంది.


Also Read: షర్మిల హాట్ కామెంట్స్, జగన్ అక్రమ సంబంధం పెట్టుకోలేదా?

కాబట్టి మొత్తంగా చూస్తే ప్రభుత్వం రిలీజ్ చేసిన వైట్‌పేపర్స్‌ను పరిశీలిస్తే మనకు తెలిసేది ఒకటే విషయం. అదేంటంటే.. ఏపీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మరి ఇదంతా పాస్ట్.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అయితే తమ ప్రభుత్వం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి. రెండింటిపై ఫోకస్ చేస్తుందని చెబుతోంది కూటమి ప్రభుత్వం. నిజానికి అలానే చేయాలి. ఎందుకంటే కూటమి సర్కార్‌ ఇచ్చిన హామీలు వైసీపీకి మించి ఉన్నాయి. వీటిని అమలు చేయడం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలాగా సంక్షేమ పథకాల హామీకి అప్పులనే ఆశ్రయిస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాదు ఇప్పుడున్న అప్పుల లెక్కలను మించి కొత్త రికార్డ్ నమోదవుతుంది. కాబట్టి.. ప్రభుత్వ ఆదాయం పెంచుతూనే.. సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. తాము కూడా ఇదే బాటలో నడుస్తామని చెబుతోంది చంద్రబాబు సర్కార్..

ఫైనల్‌గా మరో పాయింట్‌ ఉంది. జగన్ ఇకపై అసెంబ్లీకి వస్తారా? లేదా? అంటే ఇప్పుడీ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయ్యిందంటే.. అప్పుల గురించి చెబుతున్న సమయంలోనే.. అసెంబ్లీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. అసెంబ్లీలో తమ గొంతను వినిపించే అవకాశం లేదు కాబట్టి.. ఇకపై అసెంబ్లీ గడప తొక్కేదే లేదని చెబుతున్నారు జగన్‌? ఆయన టోన్ వింటే మాత్రం ఇదే అనిపిస్తోంది. ఇకపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియాతో.. అది కూడా న్యూట్రల్ మీడియాతో మాత్రమే మాట్లాడుతా అంటున్నారు జగన్. కాబట్టి ఇకపై ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే సీన్ దాదాపు కనిపించనట్టే అనిపిస్తోంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×