Big Stories

Beauty Tips : శీతాకాలం పాదాలు పగులుతున్నాయా ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

Beauty Tips :చలికాలం మొదలైందంటే చాలు.. పాదాల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. అయితే, ఇంట్లోనే ఉన్న పదార్థాలతో పగిలిన పదాలను మృదువుగా చేయొచ్చు. రండి.. అదెలాగే చూసేద్దాం.

  • మడమల వద్ద పొడిబారిన చర్మానికి తిరిగి తేమను అందించాలంటే.. తరచూ మాయిశ్చరైజర్‌రాసుకోవాలి. షియా బటర్‌ అప్లై చేసినా చాలు.
  • ఓట్స్‌, తేనె, బాదం నూనె, పాలు, చక్కెర.. వీటిని కొద్ది మొత్తాల్లో తీసుకొని బరకగా ఉండేలా పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని మడమలపై అప్లై చేసి.. కాసేపు మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకుంటే సరి.
  • రాత్రి పడుకునే ముందు పసుపు-ఆలివ్‌ ఆయిల్ కలిపి మడమలకు పట్టించాలి. ఆపై సాక్స్‌వేసుకుంటే ఈ మిశ్రమం బెడ్‌షీట్స్‌కి అంటకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా రోజూ ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News