Big Stories

Alcohol Effects On Eyes: మందు బాబులకు అలర్ట్.. ఆల్కహాల్ తాగితే మీ కళ్ళు ఖతం!

Alcohol consumption

Alcohol Effects On Eyes:

- Advertisement -

ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది చాలా కామన్. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసినా.. కొందరు ఈ అలవాటును మానుకోలేరు. ఏదో ఒక కారణంతో మద్యాన్ని తాగుతుంటారు. తాగని వారిని అదోలా చూస్తుంటారు. మద్యం తాగితే మత్తు వస్తుందనేది ఎంత నిజమో.. శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం చూపుతుందనేది అంతే నిజం. ముఖ్యంగా మద్యం తీసుకున్న వారి కళ్లు చూసి ఇట్టే గుర్తుపట్టొచ్చు.

- Advertisement -

అయితే మద్యం తాగే వారిలో కళ్లు ఎర్రబడతాయి. ఇలా కళ్లు ఎర్రబటటానికి కారణం తెలిస్తే ఆశ్యర్యపోక తప్పదు. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త సరఫరా సాధారణ స్థాయికంటే పెరుగుతుంది. కంటి ఉపరితలంపై ఉన్న చిన్న రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో కంటిలోని రక్తనాళాలు ఎర్రగా మారుతాయి. మద్యం తాగినప్పుడు కళ్లు ఎర్రబడటానికి ఇదే ముఖ్య కారణం. మెదడుకు మద్యం మత్తు ఎక్కడం వల్ల మనిషి తూలుతూ నడుస్తుంటాడు.

ఆల్కహాల్ శరీరంలో ప్రవేశించిన తర్వాత రక్తనాళాలు వెడల్పుగా అవుతాయి. శరీరంలోని అన్ని భాగాలకు ఆల్కహాల్.. ఇతర పదార్థాల కంటే వేగంగా చేరుతుంది. మద్యం అతిగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ ఎవరు కూడా తాగకుండా ఉండలేకపోతున్నారు.

మద్యం తాగేవారిలో కళ్లు ఎర్రగా మారడంతో పాటు.. వారి మాట తీరు కూడా మారుతుంది. ఆల్కహాల్‌తో గుండె, కాలేయం, కీడ్నీలకు ఇబ్బంది కలుగుతుంది. అన్నీ తెలిసినప్పటికీ మద్యం తాగడానికే అందరూ ఆసక్తి చూపుతున్నారు. మద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటంతో మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News