BigTV English

Viswambhara Movie Cast: చిరుతో మరోసారి జోడి కట్టనున్న త్రిష.. ‘విశ్వంభర’లో హీరోయిన్ గా..

Viswambhara Movie Cast: చిరుతో మరోసారి జోడి కట్టనున్న త్రిష.. ‘విశ్వంభర’లో హీరోయిన్ గా..
vishwambhara movie cast

Trisha Krishnan in Vishwambhara Movie:


టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 68 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ తమ అభిమానులను అలరిస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే దర్శకుడు మెహర్ రమేష్‌ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దీంతో మెగాస్టార్ చిరు తన తదుపరి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన వద్దకు వస్తున్న కథలలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ మూవీకి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘బింబిసార’ఫేం వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను కూడా మేకర్స్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


దర్శకుడు వశిష్ట ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో శింబు ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ విని చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు శింబు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక ఈ మూవీలో చిరు సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్‌ గురించి మేకర్స్ అద్భుతమైన అప్డేట్ అందించారు. ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు తాజాగా చిరుతో పాటు త్రిష కూడా షూటింగ్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను మెగస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా త్రిష కూడా తన ట్విట్టర్ ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇది తనకు ఎంతో గొప్ప గౌరవం అంటూ.. చిరు సార్‌ తనకు హృదయపూర్వకంగా స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు అంటూ అందులో రాసుకొచ్చింది.

కాగా చాలా రోజుల నుంచి ఈ మూవీలో త్రిష నటించబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే వార్తలు నిజం కావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ నడుస్తోంది. అందులో ఒకరు త్రిష కాగా.. మరో ఇద్దరిలో అనుష్క, హనీ రోజ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా ఇటీవల మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి సినీ ప్రియులను సర్ప్రైజ్ చేశారు. 2025 జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×