Big Stories

power nap : పెంగ్విన్ల కునుకు.. 10 వేల సార్లు

power nap

power nap : శరీరానికి విశ్రాంతి అవసరం. కొందరైతే కొద్దిసేపే నిద్రపోతారు. శారీరక శ్రమ మటుమాయం కావడానికి అది చాలు. దీనినే పవర్ నేప్ లేదా మైక్రో నేప్ అని అంటారు. అంటార్కిటికాలోని పెంగ్విన్లు అయితే ఏకంగా 10 వేల సార్లు కునుకుతీస్తాయి. ఒక్కో నేప్ కూడా కొన్ని సెకన్ల వ్యవధే ఉంటుంది.

- Advertisement -

నెస్టింగ్ కాలనీల్లో పెంగ్విన్లు ఒక రోజులో 10 వేల మైక్రో స్లీప్స్ తీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా అవి నిద్రించే సమయం మొత్తం 11 గంటలు. ఇలా స్వల్ప విరామాలతో నిద్రలోకి జారుకోవడం వెనుక మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు.

- Advertisement -

పెంగ్విన్ పేరెంట్లలో ఒకటి ఆహారం కోసం బయటికి వెళ్తే.. మరొకటి తమ పిల్లలను కాపాడే పనిలో ఉంటాయి. ఈ క్రమంలో మధ్యమధ్యలో కొన్నిసెకన్లు అవి రెప్పవాలుస్తాయట. మానవులకు ఎంతో ప్రయోజనం కలిగించే మైక్రో నేప్ నిమిషాల పాటు కొనసాగితే.. మైక్రోస్లీప్ అంతకన్నా తక్కువ సమయమే.

పెంగ్విన్ల కునుకుపై శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా పెంగ్విన్ల మెదడుకు, మెడ కండరాల వద్ద పరికరాలను ఇంప్లాంట్ చేశారు. బ్రెయిన్ వేవ్, లొకేషన్ డేటా పరికరాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అవి తమ ఆవాసాల్లో ఎంత సేపు నిద్రిస్తాయన్నది లెక్కతేల్చారు.

ఇలా పరికరాలు అమర్చి పెంగ్విన్ల నిద్ర సమయాన్ని తెలుసుకున్న దాఖలాలు గతంలో ఎన్నడూలేవు. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మక పరిశీలనగానే భావించాలి. జంతువుల నిద్రకు సంబంధించి మరింత డేటాను సేకరించి.. సంపూర్ణ అధ్యయనం చేపట్టాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News