Big Stories

Mit-Ultrasound Sticker : ఆర్గాన్ల గుట్టు విప్పే స్టిక్కర్..!

Mit-Ultrasound Sticker

MIT Engineers Designed Ultrasound Stickers : మానవ శరీరంలో ఉండే ఆర్గాన్ల మొత్తం 78. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మన మనుగడ. అత్యంత కీలక అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల్లో ఏ ఒక్కటైనా కొన్ని సెకన్ల పాటు పనిచేయడం ఆపేస్తే మరణం తథ్యం. వీటి పనితీరుపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుండాలి.

- Advertisement -

ఏదైనా ఆర్గాన్ ఆకస్మికంగా చెడిపోవచ్చు. లేదంటే క్రమేపీ పనితీరు మందగిస్తుండొచ్చు. అలాంటి సమయాల్లో ఆ అవయవం గట్టిపడుతుంటుంది. ఇలా
గట్టిపడుతున్న ఆర్గాన్ల పనితీరును పరిశీలించేందుకు అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఓ చక్కటి సాధనం. ఈ పరీక్షల కోసం మనం ఆస్పత్రికి వెళ్లాలి. ఎంతో సమయం వెచ్చించాలి. ఈ బాధలను తప్పించడంలో మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ(MIT) ఇంజనీర్లు కనుగొన్న ఓ వినూత్న పరికరం.. ఓ కీలక ముందడుగే అని చెప్పొచ్చు.

- Advertisement -

అంతర్గత అవయవాల పనితీరును మదింపు చేసే అల్ట్రాసౌండ్ స్టిక్కర్‌ను ఎంఐటీ ఇంజనీర్లు కనుగొన్నారు. పోస్టల్ స్టాంప్ సైజులో ఎంతో తేలిగ్గా ఉండే ఈ వేరబుల్ స్టిక్కర్‌ను శరీరంపై అతికించుకుంటే చాలు. 48 గంటల పాటు ఆయా అవయవాలకు
సంబందించి అల్ట్రాసౌండ్ ఇమేజెస్‌ను అందిస్తుంది. లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులనూ సులువుగా గుర్తించే వీలుంది.

Read more: డయాబెటీస్.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిస్టేక్స్ చేయకండి..!

అంతే కాదు.. కణితులు వంటివి ఏవైనా శరీరంలో ఎంత వేగంతో పెరుగుతున్నాయనేది
హెచ్చరిస్తుంది. మందుల దుకాణాల్లో బాండ్ ఎయిడ్‌ను కొనుగోలు చేసినట్టుగానే ఈ అల్ట్రాసౌండ్ స్టిక్కర్లు మార్కెట్లో లభ్యమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

నిరుడు జూలైలో ఆవిష్కరించిన స్టిక్కర్‌ను తాజాగా నవీకరించారు. ఈ స్టికీ సెన్సర్ ద్వారా శబ్ద తరంగాలు శరీరంలోకి వెళ్లి.. ఆర్గాన్‌ను తాకుతాయి. తద్వారా దాని గట్టిదనం ఏ మేర ఉందన్నదీ గ్రహించి.. ఆ సమాచారాన్ని అందిస్తుంది.

ఒకవేళ ఆర్గాన్లు ఏవైనా వ్యాధి బారిన పడినప్పుడు కాలక్రమంలో గట్టిపడతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎంఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్
జునే జావో వివరించారు. ఆ గట్టిదనంలో మార్పులను ఈ వేరబుల్ స్టిక్కర్
గమనిస్తుంటుందన్నారు. దాంతో ఆర్గాన్ వైఫల్యంపై ముందే ఓ అంచనాకు రావొవచ్చని చెప్పారు.

ఎలుకల్లో యాక్యూట్ లివర్ ఫెయిల్యూర్‌ను ఈ స్టిక్కర్ ద్వారా గుర్తించగలిగారు. మానవప్రయోగాలు చేపట్టాల్సి ఉంది. కిడ్నీలు, వంటి ఆర్గాన్ల స్టిఫ్‌నెస్‌ను అల్ట్రాసౌండ్
ఎలాస్టోగ్రఫీ ద్వారా గుర్తిస్తున్నారు. ఈ సాంకేతికత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ లాగానే ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News