Big Stories

Diabetes Diet : డయాబెటీస్.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిస్టేక్స్ చేయకండి..!

Breakfast for Diabetics

Morning Breakfast for Diabetics (health news today):

- Advertisement -

బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మన డే ని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేస్తే ఆ రోజంగా ఆరోగ్యాంగా ఉంటాము. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మనకు తెలియకుండానే చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల డయాబెటిస్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఆహారం మన రక్తంలో కలుస్తుంది.

- Advertisement -

ఇది మనశరంలోని చక్కెరలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మన పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్ విషయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. ఆ ఆహారం రక్తంలోని చక్కెరపై ఎంత వరకు ప్రభావం చూపుతాయి. దాని వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎంటనేది తెలుసుకోవాలి. ఇలా తెసుకోవడం వల్ల మంచి ఆహారాన్ని తీసుకొని.. రోజంతా హెల్దీగా ఉంటారు.

Read More : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా..!

అయితే మన బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. పొరపాట్లను ఎంత వరకు కంట్రోల్ చేయాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. బ్రేక్‌‌ఫాస్ట్ విషయంలో చేయకూడని తప్పులేమిటో తెలుసుకుందాం.

చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం. డయాబెటీస్ ఉన్నా.. లేకున్నా బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయద్దు. మరి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్లు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే డయాబెటీస్‌తో బాధపడేవారు రక్తంలో చక్కెరను కంట్రలో చేయడానికి ఉదయాన్నే మందులు తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి.. మందుల ప్రభావం పడి హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మధ్నహ్నం ఎక్కువ తినేస్తారు. ఇది డయాబెటీస్ పేషేంట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు.

డయాబెటీస్ ఉన్నవారి ఆరోగ్యానికి ఫైబర్ చాలా మంచిది. ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. డయాబెటీస్ ఉన్న వారు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో 30 గ్రాముల ఫైబర్ కనీసం ఉండాలి. ఫైబర్ గుండె, జీర్ణ, పేగు సమస్యలను కూడా దూరం చేస్తుంది. బాదం, కీరదోసకాయ, స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Read More : వైట్‌రైస్ తినడం ఆరోగ్యకరమా..!

కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి డయాబెటీస్ ఉన్న వారు చాలా దూరంగా ఉంటే మంచిది. కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వైట్ బ్రెడ్, వైట్‌రైస్ వంటివి మీ ఆహారంలో లేకుండా చూసుకోండి.

అలానే మఫిన్లు, డోనట్స్, పేస్టీలు, స్వీట్స్ తీసుకోవద్దు. స్వీట్స్ తినాలనిపిస్తే.. ఫ్యాట్ చీజ్ జత చేసి క్రేవింగ్స్‌‌‌గా తినండి. కూరగాయలు, పండ్లు, గుడ్లు, చిక్కులు డయాబెటిస్‌తో బాధపడే వారి ఆరోగ్యానికి మంచిది. మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి ఉండేలా చూసుకోండి.

Disclaimer : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News