Big Stories

ED Rides on Opposition: ఈడీ దండయాత్ర.. ప్రతిపక్ష నేతలే ఈడీ టార్గెట్టా..?

- Advertisement -

దీనికి అంత పవర్‌ ఇచ్చింది 2002లో వచ్చిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్ యాక్ట్.. అయితే UPA హయాంలో కంటే.. NDA హయాంలో ఈడీ దూకుడు పెరిగిందనే చెప్పాలి.. అయితే ఈ పదేళ్లలో ఈడీ రాడార్‌లోకి వచ్చినవారిలో ఎక్కువమంది పొలిటిషియన్సే అనే చెప్పాలి.. లెటెస్ట్‌ అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అంతకుముందు కవిత.. అయితే ఒక్కసారి ఈడీ డేటాపై ఫోకస్ చేస్తే.. UPA హయాంలో ఈడీ నమోదు చేసిన కేసులు 1797.. అదే NDA హయాంలో 5 వేల 155 కేసులు.. అయితే UPA హయాంలో చార్జ్‌షీట్‌లు నమోదైంది మాత్రం జస్ట్‌ 102 మాత్రమే.. NDA హయాంలో 1281.. కౌంట్‌ పెరిగినా నమోదైన కేసుల సంఖ్యతో కంపేర్ చేస్తే ఈ కౌంట్ కూడా తక్కువే.. 2005 నుంచి 2014 మధ్య ఈడీ 84 సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించింది.

- Advertisement -

2014 నుంచి 2024 మధ్య ఈ సంఖ్య 7 వేల 300 ఇక అరెస్ట్‌ల సంఖ్య చూసుకుంటే UPA హయాంలో 29 ఉండగా  NDA హయాంలో ఆ సంఖ్య 755.. అయితే UPA హయాంలో ఈడీ 5 వేల 86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తే. అదే NDA హయాంలో లక్షా 21 వేల 618 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అయితే యూపీఏ హయాంలో ఎలాంటి ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు ఈడీ. కానీ NDA హయాంలో మాత్రం 15 వేల 710 కోట్ల విలువైన ఆస్తులను మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అయితే ఇన్ని కేసులు నమోదు చేసినా ఇన్ని ఆస్తులు జప్తు చేసినా ఇప్పుటి వరకు కన్విక్ట్‌ అంటే.. నేరం రుజువైంది మాత్రం జస్ట్.. 63 కేసుల్లో మాత్రమే  మిగిలిన కేసులన్ని ఇంకా విచారణలోనే ఉన్నాయి. గడచిన పదేళ్లల్లో అన్ని విషయాల్లో దూకుడు ప్రదర్శించింది ఈడీ.. గత పదేళ్లలో కేసుల నమోదు సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

Also Read: A boat capsized Mahanadi: విహారయాత్రలో విషాదం, మహానదిలో పడవ బోల్తా

సోదాల విషయాల్లో 86 రెట్లు.. అరెస్టులు 26 రెట్లు.. జప్తులు 24 రెట్లు.. చార్జీషీట్ల సంఖ్య 12 రెట్లు.. ఇలా ప్రతి విషయంలో పెరగడమే కానీ.. తరగడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిందితులను అప్పగించాలంటూ పలు దేశాలకు రిక్వెస్ట్‌ లెటర్లు పంపింది ఈడీ.. మొత్తం 43 మందిని తమకు అప్పగించాలని కోరింది. ఇందులో విజయ్‌ మాల్యా, నీరవ్ మోడీ, సంజయ్ భండారిలు కూడా ఉన్నారు. గణాంకాలు గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈడీ ఫుల్ జోష్‌పై ఉంది. కానీ ఆరోపణలు, విమర్శలు కూడా అదే స్థాయిలో పెరిగాయి ఈ పదేళ్లలో ఈడీ, సీబీఐ లాంటి ఏజెన్సీలు కేంద్ర పెద్దల చేతుల్లోని కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ఒక్క రాహుల్ గాంధీ మాత్రమేకాదు. దేశంలోని అనేక పార్టీల నేతలు ఈడీ, సీబీఐ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈడీ నమోదు చేసే కేసుల్లో మాజీలతో పాటు  సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉంటున్నారు.. 2023లో రాజకీయ నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు.. 176.. పోలీస్‌ స్టేషన్లలలో ఎంత ఫాస్ట్‌గా అయితే FIR నమోదు చేస్తారో అంతే స్పీడ్‌లో ఈడీ కేసులు నమోదు చేస్తుంది. అయితే గత పదేళ్లలో నమోదైన కేసులతో కంపేర్ చేస్తే ఇది మూడు శాతంగా ఉన్నా గత రెండేళ్లలో మాత్రం నేతలపై కేసులు మాత్రం పెరిగాయి. అందుకే విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. అయితే ఈ విమర్శలకు బీజేపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు.

Also Read: నెస్లే నాటకాలు.. చిల్డ్రన్స్ ప్రొడక్ట్స్ లో భారీగా షుగర్ లెవల్స్

ఇప్పటి వరకు అరస్టైన వారిలో జస్ట్‌ 3 పర్సెంట్ మాత్రమే పొలిటికల్ లీడర్స్ ఉన్నారని మిగిలిన వారంతా వ్యాపారవేత్తలు, అధికారులే ఉన్నారంటున్నారు. అంతేకాదు లక్షల కోట్ల విలువైన అక్రమాస్తులను ఈడీ సీజ్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నారు.ఎవరి వాదనలు ఎలా ఉన్నా  ఈడీకి అపరిమిత అధికారాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చైతే నడుస్తుంది. ముందుగా ఈడీ సోదాలు జరగడం  వెంటనే ఆయా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం  అధికార పార్టీకి ఇవ్వడం ఆ తర్వాత కేసులు సైడ్ అవ్వడం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు ఈడీ డైరెక్టర్‌ కె.మిశ్రా విషయంలో కూడా మోడీ సర్కార్‌కు సుప్రీంకోర్టు తలంటింది.. ఎందుకంటే ఆయన పదవీ కాలాన్ని అనేకసార్లు పొడిగించింది కేంద్రం దీనికి అనేక సాకులు చెప్పింది. చివరికి సుప్రీంకోర్టు అస్సలు ఒప్పుకోకపోవడంతో తొలగించక తప్పలేదు. ఆ తర్వాత కూడా ఈడీకి పర్మనెంట్‌ డైరెక్టర్‌గా నియమించలేదు కేంద్రం ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్ ఉన్నారు.. కేంద్రం శాశ్వత నియామకం మాత్రం చేపట్టడం లేదు? ఎందుకనేది అస్సలు అర్థం కాని ప్రశ్న  అంతేకాదు ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్‌ వేగంగా జరుగుతుంది మంచిదే.. కానీ బీజేపీ నేతల ప్రమేయం ఉన్న కేసుల్లో మాత్రం అలా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2014 తర్వాత రాజకీయ నేతలపై నమోదైన కేసుల్లో 95 శాతం మంది ప్రతిపక్షానికి చెందినవారే కావడం విశేషం. సో ఈడీ దూకుడు మంచిదే.. కేసుల నమోదు మంచిదే.. బట్.. అన్ని కేసులను ఒకేలా ట్రీట్ చేయడం అన్ని పార్టీల నేతల నేరాలను ఒకేటా ట్రీట్ చేయడం కూడా అవసరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News