BigTV English
Advertisement

Tillu Square in OTT: ఇట్స్ అఫీషియల్.. థియేటర్లలో కుమ్మేసిన టిల్లుగాడు.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు!

Tillu Square in OTT: ఇట్స్ అఫీషియల్.. థియేటర్లలో కుమ్మేసిన టిల్లుగాడు.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు!

Tillu Square OTT Official Date Confirmed: సినీ ప్రియులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అఫీషియల్‌గా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వెల్లడించింది. అయితే మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో.. ఏ డేట్‌లో వస్తుందో అనే విషయానికొస్తే..


యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ మూవీ 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఎవరూ ఊహించని కలెక్షన్లను ఈ మూవీ నమోదు చేసింది. దీంతో ఈ మూవీ ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌ను ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ సీక్వెల్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


Also Read: Upasana: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..

రామ్ మల్లిక్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలయికలో ‘టిల్లు స్క్వేర్’గా తెరకెక్కింది. అయితే రిలీజ్‌కు ముందు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ట్రైలర్‌లో అనుపమ ముద్దు సీన్లతో రెచ్చిపోవడంతో యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు.

దీంతో ఈ మూవీ రిలీజ్ రోజే థియేటర్లకు పరుగులు పెట్టారు. అయితే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ మూవీ కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించింది. మొదటి రోజు ఏకంగా రూ.28 కోట్లు కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరచింది. అలా ఈ మూవీ ఇప్పటికి దాదాపు రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది.

ముఖ్యంగా ఈ మూవీలో సిద్దుగాని మాటలు, కామెడీ టైమింగ్ చాలామందిని అట్రాక్ట్ చేశాయి. అంతేకాకుండా అనుబ్యూటీ రొమాంటిక్ సీన్లతో సినిమా రేంజ్ మరింత స్థాయిలో చేరుకుంది. మొత్తంగా ఈ మూవీ అన్ని ఎలిమెంట్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో అక్కడక్కడా రన్ కొనసాగుతోంది.

Also Read: టిల్లు గాడు చెప్పి మరీ కొట్టాడుగా..? రూ. 100 కోట్ల క్లబ్ కి దగ్గరలో టిల్లు

అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయింది. టిల్లు స్క్వేర్ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. దీంతో ఒప్పందం ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×