Big Stories

First Phase Lok Sabha Elections: ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్.. ఓటేసిన హీరోలు, రాజకీయనేతలు!

First Phase Lok Sabha Polling: తొలివిడత లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. వీటిలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండగా.. అస్సాం, ఛత్తీస్ గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, తమిళనాడు, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు.

- Advertisement -

తొలిదశ లోక్ సభ ఎన్నికల్లో 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1625 మందిలో 1491 మంది పురుషులుండగా..134 మంది మహిళలున్నారు. ఇక ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్లమంది మహిళలు ఉండగా.. 11,371 మంది ట్రాన్స్ జెండర్లున్నట్లు ఈసీ వివరించింది. వీరిలో 35.67 లక్షలమంది ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14.14 లక్షల మంది 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారని, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని.. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునే వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -

Also Read: రూటు మార్చిన నవీన్, ఈసారి టార్గెట్ వెస్ట్

ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కై ఈసీ 87 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుండగా.. సమస్యాత్మకమైన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ పూర్తికానుంది. ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్న పోలింగ్ బూత్ కు చేరుకున్న ఆయన ఓటు వేసి.. మీడియాతో మాట్లాడారు. “ఓటు వేయడం మన విధి, హక్కు కూడా. ఓటింగ్ ద్వారా వచ్చే ఐదేళ్లపాటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాం అందుకే అందరూ ఓటు వేయాలి. ఈరోజు నేను చేసిన మొదటి పని ఓటు వేయడమే” అని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Also Read: Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!

ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న తొలివిడత లోక్ సభ ఎన్నికలలో సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుని.. ఓటు అనే అస్త్రంతో మీ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. పళనిస్వామి సేలంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే తమిళనాడు మాజీ సీఎం రామాంతపురంలో ఓటు వేయగా.. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, శివకార్తికేయన్ చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ నేత చిదంబరం శివగంగలో, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఉత్తుపట్టిలో, మాజీ గవర్నర్ తమిళిసై సాలిగ్రామంలో, నటుడు అజిత్ కుమార్, ధనుష్, ప్రభు గణేశన్ చెన్నైలో ఓటేశారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ జయపురలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరులో, బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ హరిద్వార్ లో ఓటేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News