Big Stories

Nestle Adds More Sugar to Infant Milk: నెస్లే నాటకాలు.. చిల్డ్రన్స్ ప్రొడక్ట్స్ లో భారీగా షుగర్ లెవల్స్..!

Nestle Adds Sugar To Infant Milk Sold in Poorer Countries: బుడి బుడి అడుగులు వేసే మీ చిన్నారికి మా ప్రొడక్ట్ తినిపించండి. ఇక వారు అడుగులు కాదు.. పరుగులు పెడతారు అంటూ ఓ తెగ ప్రచారాలు చేస్తారు. చివరికి అవి తినిపిస్తే వారికి కోరి రోగాలను కొని తీసుకొచ్చినట్టే అని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. మేం ఎందుకింత భారీగా ఎలిగేషన్స్‌ వేయాల్సి వస్తుందంటే.. స్విట్జర్లాండ్ కంపెనీ నెస్లే.. అది చేసే దారుణాలు. అంతేకాదు నెస్లే ఒక్కో దేశంలో పిల్లలని ఒక్కోలా ట్రీట్ చేస్తుందన్న విషయం కూడా ఇప్పుడు బయపడింది. నెస్లే.. ఈ స్విస్ కంపెనీ ఇండియన్స్‌ అందరికీ వెల్‌నోటెడ్.. గతంలో మ్యాగీలో టేస్ట్‌ కోసం లెడ్ వంటి కెమికల్స్‌ను యూజ్‌ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ అదే కంపెనీ మరోసారి లైమ్‌లైట్‌కి వచ్చింది. ఈసారి చిన్నపిల్లలకు ఉపయోగించే ప్రొడక్ట్స్‌లో షుగర్‌ యాడ్ చేస్తుంది నెస్లేపై అలిగేషన్.. స్విస్ కంపెనీలపై నిత్యం నిఘా ఉంచే పబ్లిక్‌ ఐ అనే ఆర్గనైజేషన్‌ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నెస్లే చిన్న పిల్లల ప్రొడక్ట్స్‌లో షుగర్‌ను మిక్స్‌ చేస్తుందంటూ తెలిపింది. ఇదే నిజమైతే పిల్లల ఆరోగ్యంతో నెస్లే ఆడుకుంటుంది అని చెప్పడానికి ఏం డౌట్‌ లేదు. నిజానికి నెస్లే ప్రొడక్ట్స్‌ ఇండియాలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమ్ముడవుతున్నాయి. బేబి ప్రొడక్ట్స్‌లో షుగర్ మిక్స్ చేయడం అనేది అంతర్జాతీయ ప్రమాణాల ఉల్లంఘన.. బేబీ మిల్క్, సెరెలాక్ వంటి వాటికి షుగర్ యాడ్ చేస్తే. చిన్నారులకు ఒబేసిటీతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే బేబి ప్రొడక్ట్స్‌లో షుగర్‌ను మిక్స్‌ చేయవద్దని ఇంటర్నెషనల్‌ గైడ్‌లైన్స్ ఉన్నాయి.

పోనీ అన్ని దేశాల్లో ఇలా చేస్తుందా? అంటే ఆన్సర్ నో.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో బెబీ ప్రొడక్ట్స్‌లో షుగర్ యాడ్ చేస్తుంది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలలో అసలు షుగర్‌ మిక్స్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని నెస్లే బేబి ప్రొడక్ట్స్‌లో షుగర్ కంటెంట్‌ ప్రతి గ్రాముకి 3 పర్సెంట్ షుగర్ ఉంది .. మొత్తం 15 ప్రొడక్ట్స్‌లో ఈ లెవల్స్ కనిపించాయి. ఎట్ ది సేమ్ టైమ్ యూకే, జర్మనీ లాంటి దేశాల్లో అమ్తుతున్న పొడక్ట్స్‌లో అసలు షుగర్ కంటెంట్‌ లేదు. అక్కడ చూపుతున్న రీడింగ్ జీరో.. అత్యధికంగా థాయ్‌లాండ్‌లో అమ్మె ప్రొడక్ట్స్‌లో ఇది 6 పర్సెంట్ ఉంటుంది. ఇథియోపియాలో 5.2, సౌతాఫ్రికాలో 4, పాకిస్థాన్‌లో 2.7, బంగ్లాదేశ్‌లో 1.6గా ఉంది.

- Advertisement -

Also Read: Diabetes : ఉపవాసం వల్ల షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి..?

- Advertisement -

స్టాటస్టిక్స్‌ చూస్తే 2022లో నెస్లే ఇండియాలో 20 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన సెరెలాక్ ప్రొడక్ట్స్‌ను సేల్ చేసింది నెస్లే.. అంటే వీటన్నింటిలో షుగర్‌ కంటెంట్‌ యాడ్ అయ్యి ఉంది. తల్లిదండ్రులు వారికి తెలియకుండానే పిల్లలకు షుగర్ తినిపించినట్టే అని చెప్పాలి. అయితే తమపై వస్తున్న ఆరోపణలపై నెస్లే స్పందించింది. కంపెనీ ఇచ్చిన వివరణ.. ఇప్పుడు మరింత కాంట్రవర్సీగా మారింది. తాము షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే తగ్గించి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది నెస్లే.. గతంలో యాడ్ చేసిన దానికంటే 30 శాతం షుగర్‌లను తగ్గించినట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. అంటే గతంలో ఇంతకంటే ఎక్కువ షుగర్ లెవల్స్‌ను నెస్లే యాడ్ చేసిందా? అంటే కంపెనీ తెలిసే ఈ దారుణానికి పాల్పడిందా? అనేది పెద్ద క్వశ్చన్.

నిజానికి ఇండియాలోనే కాదు.. లాటిన్ అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలో కూడా ఈ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎక్కువగా మధ్యతరగతి జనాభా ఉన్న దేశాల్లో కంపెనీ ఈ ఉత్పత్తులను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. అయితే అన్ని దేశాల్లో కూడా తమ ప్రొడక్ట్స్‌లో చేర్చిన విటమిన్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ.. షుగర్ గురించి మాత్రం చెప్పడం లేదు. ఓ రకంగా ఇది మోసమే అనే వాదనలు మొదలయ్యాయి. అయితే ఎక్స్‌పర్ట్స్‌ పిల్లల తల్లిదండ్రులను వార్న్ చేస్తున్నారు. చిన్నారుల ప్రొడక్ట్స్‌లో షుగర్‌ లెవల్స్‌ అధికంగా అస్సలు ఉండకూడదని చెబుతున్నారు. ఒక్కసారి పిల్లులు ఈ టేస్ట్‌కు అలవాట్ పడితే.. వాటిని మాత్రమే తినేందుకు ఇష్టపడుతారు. ఇది క్రమంగా వారిపై ఎఫెక్ట్ చూపుతుంది. పిల్లలు కౌమర దశకు చేరుకోకముందే ఒబేసిటీ, డయాబెటిస్, బీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Also Read: చంద్రుడిపై చైనా ముందు కాలుమోపితే ఇక అంతే సంగతులు.. నాసా చీఫ్

నెస్లేపై ఇప్పటికే ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఫోకస్ చేసింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రెడీ అయ్యింది. వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేసి.. వస్తున్న ఆరోపణలపై ఇన్వెస్టిగేట్ చేసేందుకు రెడీ అవుతుంది. మరోవైపు ఇప్పటికే కంపెనీపై ఈ ఆరోపణల ఎఫెక్ట్ కనిపిస్తుంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత నెస్లే షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. గత ఏడాది కాలంగా నెస్లే ఇండియా షేర్లు దాదాపు 19 శాతం రాబడిని ఇచ్చాయి. కానీ ఈ అలిగేషన్స్‌ ఎఫెక్ట్‌తో షేర్లు 4 నెలల కనిష్టానికి పడిపోయాయి. నెస్లేకు ఇండియన్ మార్కెట్‌ నుంచే భారీగా లాభాలు వస్తాయి. ఇప్పుడీ దెబ్బకు భారీగానే నష్టపోయేట్టు కనిపిస్తోంది పరిస్థితి.

అయితే పిల్లల విషయంలో మేం ఎలాంటి తప్పు చేయలేదని. కేవలం కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఐరన్ లాంటివి మాత్రమే యాడ్ చేస్తున్నామని చెబుతోంది నెస్లే.. కానీ ఇది అంత పూర్తిగా నమ్మెట్టు కనిపించడం లేదు. ఎందుకంటే మ్యాగీ విషయంలో కూడా ఇదే జరిగింది. 2015లో మ్యాగీ నూడుల్స్‌లో లెడ్‌ స్థాయి ప్రమాదకరంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే లెటెస్ట్‌గా ఈ కేసును నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కొట్టేసింది. అలా ఈ కేసు కొట్టేసిందో లేదో.. మరో కొత్త చిక్కుల్లో పడింది నెస్లే.. కానీ కంపెనీపై వచ్చిన ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం.. చాలా మంది పిల్లల అనారోగ్యానికి నెస్లే కారణం కావడం మాత్రం ఖాయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News