BigTV English

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!

A Boat Capsized Mahanadi: విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. పిక్నిక్ తర్వాత తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక్కసారిగా పడవ నదిలో బోల్తాపడింది. ఈ ఘటన ఒడిషాలోని మహానదిలో చోటు చేసు కుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు, పలువురు జాడ కనిపించలేదు. ఇంకా రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతంది. అసలేం జరిగింది?


ఛత్తీస్‌గడ్ సరిహద్దు లఖన్‌పూర్ నుంచి దాదాపు 50 మంది పడవలో ఒడిషాలోని బరగడ్ జిల్లా బంజిపల్లికి పిక్నిక్ కోసం వచ్చారు. అంతా బాగానే జరిగింది.. అంతా ఎంజాయ్ చేశారు. తిరిగి సాయంత్రం ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. వెంటనే నదిలో బోటు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో ఏడుగురు గల్లంతయ్యారు. అయితే సమీపంలోని మత్సృకారులు బోటు తిరగబడడం గమనించి అక్కడికి వెళ్లారు.

దాదాపు 41మందిని రక్షించి వాళ్లని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఝార్సుగూడ జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. తర్వాత గాలింపు ముమ్మరం చేసింది. గల్లంతైన ఏడుగురు ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్

స్కూబా డ్రైవర్లు, సెర్చ్ లైట్లను అక్కడికి పంపారు. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొందరి కోసం సెర్చ్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం నవీన్ పట్నాయక్, ఒక్కో ఫ్యామిలీకి నాలుగు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×