Big Stories

Health Tips: ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తింటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే

Health Tips
Health Tips

Health Tips: ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను కూడా చేర్చుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఉరుకులు పరుగులు పెట్టే పట్టణ వాసులు తరచూ బయటి ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఈ క్రమంలో పలువురు ఆరోగ్యంపై శ్రద్ధతో రోజు తాము తీసుకునే ఆహారంలో పండ్లను కూడా భాగం చేసుకుంటారు. అయితే మన రోజువారి పరిస్థితి అనేది మనం ఉదయం నిద్రలేచాక తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మనం మంచి ఆహారం తీసుకుంటే ఆ రోజంతా ఆరోగ్యంగా పనులు చేసుకోగలుగుతాము. కానీ మనం ఏదైనా కాస్త నచ్చని ఆహారం లేక శరీరానికి సహకరించని ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యంతో రోజంతా జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisement -

ఉదయాన్నే బ్రేక్‌ఫస్ట్‌లోకి

- Advertisement -

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటాం. పండ్లు తినడం మంచిదే కానీ వాటిలో కూడా కొన్ని ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కొన్ని పండ్లలో ఉండే విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ వల్ల పరిగడుపున పండ్లను తినడం వల్ల కడుపులో మంట పుడుతుంది. అయితే ఉదయాన్నే పరిగడుపున కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటిపండ్లు

ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో అరటింపడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటిపండులో ఉండే ఆమ్ల స్వభావం కడుపులో జీర్ణ సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అందేకాదు, బనానాలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటివి మన శరీరంలోని రక్తంలో ఉండే పొటాషియం, మెగ్నీషియంల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతేకాదు అరటిపండులో ఉండే షుగర్ కంటెంట్ శరీరానికి శక్తిని ఇస్తుంది.. కానీ అది ఎక్కువ సేపు ఉండదని అంటున్నారు.2. ద్రాక్ష, నారింజ..

ద్రాక్ష, నారింజ పండ్లను పరిగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. నారిజం పండ్లలో ఉండే సిట్రస్ కడుపులో అసిడిటీని పెంచుతుంది. నిమ్మ, నారింజ వంటి పండ్లను ఉదయం తీసుకునే ఆహారంలో ఉంచకుండా చూసుకోండి. ఇక ద్రాక్షలో ఉండే చక్కెరతో కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3. మామిడి..

ఉదయం టిఫిన్లలో భాగంగా ముఖ్యంగా మామిడి పండును తీసుకోవడం అనారోగ్యానికి కారణమైన వాళ్లం అవుతామని చెబుతున్నారు. మామిడి కూడా ఓ రకమైన జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.

4. బొప్పాయి, పైనాపిల్..

బొప్పాయి, పైనాపిల్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్రక్టోజ్ కడుపులోని పేగులకు హాని కలిగిస్తుంది.ఉదయాన్నే యాపిల్, దానిమ్మ వంటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వీటికి బదులు డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News