Big Stories

GT vs MI: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. గెలుపెవరిది..?

Gujarat Titans vs Mumbai Indians Match Preview
Gujarat Titans vs Mumbai Indians Match Preview

Gujarat Titans vs Mumbai Indians Match Preview: ఐపీఎల్ 2024 సీజన్ 17లో అత్యంత వివాదాస్పదమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి ముంబై ఇండియన్స్ తర్వాత గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు అని చెప్పాలి. కెప్టెన్ మార్పుతో దుమ్మ దుమారం రేగింది. ముఖ్యంగా రోహిత్ శర్మను మార్చడంతో నెట్టింట నిప్పు రేగింది. ఆ మంటలు ఇప్పటికి ఆరడం లేదు.

- Advertisement -

అంతటి వివాదాలకు కారణమైన రెండు జట్లు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉండనున్నాడు. ముంబై జట్టుకి అందరికీ తెలిసిన హార్దిక్ పాండ్యా ఉన్నాడు. రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిలా ఆడనున్నాడు.

- Advertisement -

ఇకపోతే ఇప్పటికి వచ్చి ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. గుజరాత్, ముంబై చెరో రెండుసార్లు విజయం సాధించాయి. రెండు జట్లలో కూడా స్టార్ బౌలర్లు ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్ నుంచి మహ్మద్ షమీ మిస్ అయ్యాడు. దీంతో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, జాన్సన్ బౌలర్స్ స్వ్కాడ్ ఉంది.

వీరిలో మోహిత్ శర్మ హర్యానా నుంచి వచ్చాడు. కపిల్ దేవ్ ది హర్యానా అనే సంగతి అందరికి తెలిసిందే. ఐపీఎల్ లో 100 మ్యాచ్ లు ఆడి 117 వికెట్లు పడగొట్టాడు.

ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అయితే గత సీజన్ లో 17 మ్యాచ్ లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా 107 మ్యాచ్ లు ఆడి 139 వికెట్లు పడగొట్టాడు.

Also Read: క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా.. పోరాడి ఓడిన హైదరాబాద్..

శుభ్ మన్ గిల్ కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మరి ఐపీఎల్ లో తన మొదటి మ్యాచ్ ను ఎలా నడిపిస్తాడనేది వేచి చూడాల్సిందే.

ముంబై ఇండియన్స్ దగ్గరికి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, దిల్షాన్ మధుశంక, హార్దిక్ పాండ్యా, జాసన్, నువాన్ తుషార, తిలక్ వర్మ బౌలింగు విభాగంలో ఉన్నారు.

టీమ్ ఇండియాలో కీలకంగా ఉన్న బుమ్రా ఐపీఎల్ లో 145 వికెట్లు పడగొట్టాడు. పీయూష్ చావ్లా అయితే గత సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడి 22 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా 179 వికెట్లు తీశాడు. ఇరు జట్లలో మంచి బౌలర్లున్నారు. బ్యాటర్లున్నారు. మరి వీరంతా కలిసి నేటి మ్యాచ్ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News