Big Stories

Coriander Tea: కొత్తిమీర టీ ఎప్పుడైనా తాగారా.. పరిగడుపున తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Coriander Tea: ప్రతి రోజు ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అందులోను చాలా రకాల టీలు తయారుచేసుకుని తాగుతుంటారు. కొంతమంది అయితే రోజులో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు టీలు తాగడం అలవాటుగా చేసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో టీలలో అనేక రకాల టీలు తయారు చేస్తున్నారు. టీ, మసాలా టీ, అల్లం టీ, ఇలాచీ టీ ఇలా రకరకాల టీలు తయారు చేస్తుంటారు. అయితే ఈ టీలు చాలా మందికి తెలిసినా కొన్ని టీలు మాత్రం ఎవరికి తెలిసి ఉండదు. అయితే పరిగడుపున నిమ్మరసం తాగాలి అని చాలా మందికి తెలిసి ఉంటుంది. అదే విధంగా ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగితే కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

కొత్తిమీర ఆకులతో తయారుచేసే గ్రీన్ టీకి చాలా ప్రత్యేక ఉంది. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయట. కొత్తిమీర లేకుండా ఏ వంటకం కూడా అంత రుచిగా అనిపించదు. కొత్తిమీరలో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటివి కూడా మెండుగా ఉంటాయి. కొత్తిమీరలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -

బరువు తగ్గే అవకాశాలు..

కొత్తి మీర టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. ఈ టీ వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ సమస్యను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగితే శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక శరీరంపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గించేందుకు కొత్తిమీర టీ ఉపయోగపడుతుంది.

మెదడు వ్యాధుల నుంచి రక్షణ..

పార్కిన్సన్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్, అల్జీమర్స్ వంటి వ్యాధులు కొత్తిమీర ఆకులలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు మెదడు వ్యాధుల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. అందువల్ల కొత్తిమీర ఆకులను ఉడకబెట్టి తాగడం వల్ల మెదడుకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర టీని ఉదయం పరిగడుపున తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

నోటి దుర్వాసన..

నోటి దుర్వాసనతో బాధపడే వారికి కూడా కొత్తిమీర టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకులతో చేసిన టీ నోటిలోని దుర్వాసన పొగొట్టేందుకు పనిచేస్తుంది. అంతేకాదు దంతాలు, చిగుళ్లను బలపరచడంలోను తోడ్పడుతుంది. కొత్తిమీర టీతో కేవలం ఆరోగ్యమే కాదు అందానికి కూడా మేలు జరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంచేందుకు కూడా ఈ టీ సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి వాటితో బాధపడేవారికి కొత్తిమీర టీ సహాయపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News