Big Stories

Political Attacks in Andhra Pradesh: ఏపీలో ఎందుకీ రాజకీయ దాడులు.. అసలు కారకులెవరు..?

Reason Behand on Political attacks in Andhra Pradesh: ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన విధ్వంసకాండపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ఇప్పుడు వారందరికీ పోలీసులు టార్గెట్ అవుతున్నారు. ఇన్ని విధ్వంసాలకు, గొడవలకు పోలీసులే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దానికి తగ్గట్టే పలు చోట్ల పోలీసులు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. డీజీపీ స్థాయి అధికారిపై ఈసీ చర్యలు తీసుకున్నా కింద స్థాయి సిబ్బందిలో కొందరు మాత్రం వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. పోలింగ్ ముగిసాక కూడా అధికారులపై వేటు పడుతుండటమే అందకు నిదర్శనంగా కనిపిస్తుంది.

- Advertisement -

మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శిస్తూ చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ , ఐపీఎస్‌లతో పాటు కింద స్థాయి అధికారులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఒక ఐఏఎస్ అయితే ఏకంగా సస్పెండ్ అయ్యారు…ఇక పోలీస్ అధికారులు అయితే పదుల సంఖ్యలో సస్పెన్షన్‌కు గురయ్యారు. కొందరు వీఆర్‌లో ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదంటున్నారు.

- Advertisement -

మూడు సంవత్సరాల క్రితం జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి గత ఆరు నెలల క్రితం జూలు విదిలించిన ఎన్నికల కమిషన్ అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఏకంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోలింగ్ రోజు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తిరుపతి నగరానికి చెందిన ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ తో పాటు మరో ఇద్దరు ఎస్ఐలు, ఏఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారితోపాటు దొంగ ఓట్లపై ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని ఇద్దరు సీఐలు అబ్బన్న ,చక్రధర్‌లను వీఆర్‌కు పంపింది.

Also Read: SIT primary inquiry on five areas: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?

తర్వాత జరిగిన పరిణామాల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌ చంద్రమౌళిరెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ల ముగ్గురిపై క్రిమినల్ కేసులో నమోదు చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎస్పీగా వచ్చిన జాషువా టీడీపీ నేతలపై అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌ ఫిర్యాదులు అందడంతో ఆయన్ని తప్పించారు. అంతకుమునుపు ఎస్పీగా పనిచేసిన నిశాంత్ రెడ్డిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వారితోపాటు చిత్తూరులో ఎస్బీ సిఐగా ఉన్న గంగిరెడ్డిని కూడా ఎన్నికల విధులకు దూరం చేశారు.

ఇక తిరుపతి జిల్లాలో అయితే మితిమీరిన స్వామి భక్తితో అధికారులు పనిచేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అక్కడ పనిచేసిన వెంకటరమణారెడ్డి అనే కలెక్టర్‌పై ఎన్నికల కమిషన్ కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి.. ఆయన తర్వాత వచ్చిన లక్ష్మీ షా మీద పది రోజులకే వేటుపడింది. ఇదే సమయంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ ఒంగోలు ఎస్పీగా ఉన్న సమయంలో వేటు వేసింది. మరోవైపు పరమేశ్వర్ రెడ్డి స్థానంలో వచ్చిన మల్లికా గార్గే చెప్పినట్లు వినడం లేదని, వైసీపీ సర్కారు ఆమెను వారం రోజులకే తప్పించింది. ఆమె స్థానంలో కృష్ణకాంత్‌పాటిల్ అనే యువ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చారు. అయితే ఆయన పైఅధికారులు చెప్పినట్లు వినడం తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.

Also Read: గన్నవరంలో ఊహించని షాక్.. వంశీ ఫసక్..?

ముఖ్యంగా ఈసీ అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ బూత్‌లను వంద శాతం వెబ్ కాస్టింగ్ చేసి.. అక్కడ ఆర్మ్‌డ్ పోలీసులను ఉంచాలని అదేశాలు జారీ చేసిపా ఆచరణలో అమలు కాలేదు. ఆ క్రమంలో ఎన్నికలకు రెండు రోజులు ముందు ఐదుగురు సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని అనంతపురం పంపించారు. తిరుమల వన్ టౌన్ సీఐగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, పలు వివాదాల్లో ఇరుక్కున్న అంజూయాదవ్, వినోద్ కుమార్, శ్రీనివాసులు లాంటి వారు రెగ్యులర్ పోస్టింగ్ లో లేకపోయినప్పటికీ మొత్తం యంత్రాంగాన్ని వారి నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

మరోవైపు ఎస్బీ సీఐ, డీఎస్పీలతో పాటు అలిపిరి అధికారి రామచంద్రారెడ్డి, తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డిలు ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రగిరి నియోజకవర్గంలో బిఎస్ జవాన్లు ఫైరింగ్ చేయడం. కూచువారిపల్లి గ్రామంలో మహిళల మీద దాడులు ఇవన్నీస్థానిక పోలీసుల పనితీరుకు అద్దం పట్టాయి. వీటన్నిటిని మించి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో రౌడీ మూకలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Also Read: Suspicious person at Airport: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..

ముఖ్యంగా నాని కారు సీసీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు అందర్నీ ఉలిక్కిపడేలా చేశాయి. సమ్మెటలు, రాడ్లు, రాళ్లు బీరు బాటిల్స్ తో టీడీపీ అభ్యర్థి మీద దాడి చేయడం. గన్ మ్యాన్ ‌ కాల్పులు ఫ్యాక్షన్ మూవీని తలపించాయి. ఆ దాడిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, వారిని శాంతిపచేయకుండా గంటలపాటు వదిలేసి, ఆ తర్వాత వారి మీద లాఠీ చార్జి చేయడం అనేక విమర్శలకు దారితీసింది. దీనిపైన ఎన్నికల కమిషన్ తో పాటు గవర్నర్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో మరోసారి నలుగురు పోలీస్ అధికారులపై వేటు పడింది. దాంతో మరోసారి ఎస్పీ బదిలీ అయ్యార. రెండు నెలల కాలంలో ముగ్గురు ఎస్పీలకు ఒక తిరుపతి జిల్లాలోనే బదిలీ అవ్వడం గమనార్హం.

మొత్తం మీద తిరుపతి జిల్లా అంటే అక్కడ పనిచేయడానికి అందరూ భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయిప్పుడు. ఎన్నికల కమిషన్ దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పక్షపాతంతో వ్యవహరించే అధికారులకు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లైందన్న చర్చ జరుగుతుంది .. కొసమెరుపు ఏమిటంటే స్వామి భక్తి ప్రదర్శించిన అధికారులు కోట్ల రూపాయలు వెనుకేసుకు వెళ్లారంట ఓ పోలీసు అధికారి తన కుటుంబ సభ్యుల పేరుతో ఐదు ఎకరాల క్వారీ లీజులు తీసుకోగా మరో ఇద్దరు పోలీసు అధికారులు ఒకొక్కరు ఐదు కోట్ల రూపాయల విలువైన భవనాలు నిర్మించుకున్నారంట. అందుకే వారంతా అంత స్వామిభక్తి ప్రదర్శించారంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News