IPL 2024 70th Match -RR Vs KKR Match Abandoned: IPL 2024: రాజస్థాన్- కోల్ కతా మ్యాచ్ రద్దయ్యింది. వర్షం కారణంగా రాజస్థాన్- కోల్ కతా మ్యాచ్ ను రద్దు చేశారు. వర్షం పడుతుండడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. రాజస్థాన్-కోల్ కతా మధ్య చివరి లీగ్ మ్యాచ్ ను జరగాల్సి ఉండే కానీ, వర్షం కారణంగా రద్దయ్యింది.
అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే గువాహటిలో వర్షం కురిసింది. ఆ తరువాత 10 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించి మ్యాచ్ నిర్వహణ కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. అనంతరం టాస్ వేశారు. టాస్ కోల్ కతా గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ను 10.45 గంటలకు ప్రారంభించాలనుకున్నారు. అంతా సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే వర్షం మళ్లీ కురిసింది. దీంతో మ్యాచ్ కు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఈక్రమంలో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం వల్ల ఆలస్యంగానైనా ప్రారంభించాలనుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. కానీ, వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో కోల్ కతా పై ఎట్టకేలకు విజయం సాధించి క్వాలిఫయర్ -1కు అర్హత సాధించాలనుకున్న రాజస్థాన్ ఆశపై వరుణుడు నీళ్లు చల్లినట్లయ్యింది. అయితే, మ్యాచ్ రద్దుకావడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ ను కేటాయించారు.
Also Read: పంజాబ్‌పై SRH విజయం
ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో రాజస్థాన్, హైదరాబాద్ 17 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లు సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తో సన్ రైజన్స్ హైదరాబాద్ రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది. అహ్మదాబాద్ లో ఈ నెల 21న హైదరాబాద్, కోల్ కతా మధ్య క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో ఆ జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనున్నది. అయితే, ఓడిన జట్టుకు మాత్రం మరో అవకాశం ఉండనున్నది. వర్షం కారణంగా నేడు మ్యాచ్ రద్దవడంతో ఓ పాయింట్ అందుకున్న రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీతో తలపనున్నది.
కాగా, నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో హైదరాబాద్ విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడి గెలిచామంటూ ఆ టీమ్ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. అయితే, మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్లకు గాను 214 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ పై విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఓపెనర్ బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ 66 పరుగులు తీశాడు. నితీశ్ రెడ్డి 37 పరుగులు తీశాడు. హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులు తీశాడు. రాహుల్ త్రిపాఠి 33 పరుగులు తీశాడు. ఇలా హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు పరుగులు తీస్తూ పంజాబ్ పై విజయం సాధించారు.