Big Stories

Amazon Mobile Offer : ఇదే కదా కావాల్సింది.. రూ.17 వేల 5G ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్!

Amazon Mobile Offer :  ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సమ్మర్ సేల్ జోరుగా జరుగుతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లుకు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా కొన్ని స్మార్ట్‌ఫోన్లపై బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటుంటే.. సేల్‌లో అనేక బ్రాండ్‌ ఫోన్లు మంచి డీల్‌‌కు కొనుగోలు చేయవచ్చు. Realme Narzo 70x 5Gని తక్కువ ధరకు పొందొచ్చు. ఈ శక్తివంతమైన 5G ఫోన్‌ను రూ. 16,999కి బదులుగా రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

అమెజాన్‌లో రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. సేల్ భాగంగా దీనిపై 29 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాకుండా రూ.1000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటిని ఉపయోగించుకొని ఫోన్‌ను రూ.10,999కి దక్కించుకోవచ్చు. అలానే నెల EMIగా రూ.580 చెల్లించి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 4 GB RAM+ 128 GB స్టోరేజ్, GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ లభిస్తుంది. 

- Advertisement -

Also Read : అదిరిపోయే డిజైన్‌తో సామ్‌సంగ్ 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Realme Narzo 70x 5G ఫోన్ 6.72-అంగుళాల పూర్తి-HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6100+ SoCతో Arm Mali-G57 GPUతో 6GB వరకు RAMతో వస్తుంది. ఇది డైనమిక్ ర్యామ్ ఫీచర్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Realme Narzo 70x 5G  ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది దీనిని 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0పై రన్ అవుతుంది. ఫోన్‌కు మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, రెండేళ్ల OS అప్‌డేట్‌లను కంపెనీ ఇస్తుంది.

Also Read : 50MP కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. మరికొన్ని గంటల్లో లాంచ్!

Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించబడింది. దీన్ని సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ బ్యాటరీ అలర్ట్, ఛార్జింగ్ పర్సంటేజ్‌ను చూపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News