Big Stories

Andhra Pradesh Assembly Election 2024: చూడరయా.. ఏపీ ఎన్నికల సిత్రాలు..!

Election news in Andhra Pradesh & Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో అసెంబ్లీ ఎన్నికలు.. జోరుగా ప్రచారం చేశారు నేతలు.. రోడ్‌ షోలు, ర్యాలీలతో హోరెత్తించారు. బహిరంగసభలు, కార్నర్‌ మీటింగ్‌ల్లో స్పీచ్‌లు దంచికొట్టారు. ఇవన్నీ రోటినే.. కానీ కొన్ని సీన్స్‌ మాత్రం చూస్తే.. నా భూతో నా భవిష్యత్‌ అన్నట్టుగా ఉన్నాయి. సింపుల్‌గా వీటినే ఎన్నికల సిత్రాల పేరుతో మీ ముందు ఉంచుతున్నాం.

- Advertisement -

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా.. అలాంటి మన దేశంలో జరిగే ఎలక్షన్స్‌ అంటే చాలా పెద్ద తంతు.. దీనికి చాలా పకడ్బంధీ ప్రణాళిక ఉండాలి. పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ అవసరం. భారీ భద్రతా ఏర్పాట్లు.. భారీగా ఎలక్షన్ సిబ్బంది. కొండలు, కొనల్లో ఉన్న గ్రామాలకు వెళ్లి మరీ పోలింగ్ నిర్వహిస్తారు ఎన్నికల సిబ్బంది. ఇదంతా నాణానికి ఓ వైపు. మరోవైపు నేతలు.. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం పీఠంలో కూర్చునేందుకు వారి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.. వారు చేసే ఎన్నికల స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.. దేశం మొత్తం వద్దు కానీ ఏపీని చూద్దాం.. దేశం మొత్తం రాజకీయాలు ఒకవైపు అయితే.. ఏపీలో పాలిటిక్స్ మాత్రం చాలా డిఫరెంట్.. ఇక్కడ ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో.. ఎవరు విడిపోతారో.. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకంటారో అస్సలు ఊహించలేం.

- Advertisement -

ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన.. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.. చంద్రబాబు ప్రధాని మోడీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఇందులో ఏం తక్కువ కాదు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ చాలా విమర్శలు చేశారు. కానీ ఈసారి ఎన్నికలు వచ్చే సరికి సీన్ మారిపోయింది. అధికారం కోసం ఏకమయ్యారు. వైసీపీపై యుద్ధానికి శంకం పూరించారు. ప్రస్తుతం ఒకే వేదికపై కూర్చొని కలిసి అధికార పార్టీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ-టీడీపీ పొత్తునైతే దాదాపు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ దాన్ని చేసి చూపించారు చంద్రబాబు, మోడీ. ఈ ఎన్నికల్లో ఇదే పెద్ద ఎన్నికల స్టంట్..

Also Read: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

ఇదే పెద్ద షాక్‌ అనుకుంటే.. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. దానిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం మరో విశేషం. ఏ కాంగ్రెస్‌ పార్టీపై అయితే షర్మిల తీవ్ర విమర్శలు చేశారో.. అదే కాంగ్రెస్‌లో ఆమె తన పార్టీని విలీనం చేస్తారని అస్సలు ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఒక హైలేట్ అయితే.. కాంగ్రెస్‌లో చేరిన షర్మిల అన్నయ్య వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం హైలేట్‌కే హైలేట్.. గత ఎన్నికల సమయంలో వైఎస్‌ షర్మిల అన్నయ్య కోసం మండుటెండల్లో తిరిగారు. జగన్‌ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అన్నయ్యపై విమర్శలు చేస్తూ.. అది కూడా అలాంటి ఇలాంటి విమర్శలు కాదు. సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు.. ప్రజలకు ఏం చేస్తాడంటూ.. వ్యతిరేక రాగం ఎత్తుకున్నారు.

ఇందులో కోసమెరుపు ఏంటంటే.. అన్నాచెల్లెల్ల మధ్య తగువులాటలో చిక్కుకొని ఎటూ తేల్చుకోలేక విమానం ఎక్కేసిన విజయమ్మ కూడా.. ఆఖరి నిమిషంలో ఎవరికి ఊహించని షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు న్యూట్రల్‌గా కనిపించిన విజయమ్మ.. ఇప్పుడా ముసుగును తొలగించి.. షర్మిలకు జై కొట్టారు. కడప ప్రజలు ఆమెను పార్లమెంట్‌కు పంపించాలంటూ ఓ ట్వీట్ వేసారు.. ఇది కూడా ప్యూర్ ఎన్నికల స్టంటే.

ఇక మరో హైలేట్.. పవన్‌ కల్యాణ్, చింతమనేని ప్రభాకర్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం.. గత ఎన్నికల్లో వీరిద్దరి చేసుకున్న పరస్పర విమర్శలు ఆ ప్రాంత ప్రజలు, సోషల్‌ మీడియా మర్చిపోలేదు. చింతమనేనిని ఓ రౌడీ అన్నారు పవన్.. దానికి కౌంటర్‌గా చింతమనేని చిందులు వేశారు. కానీ ఇదంతా గతం.. అప్పుడంటే వేరు వేరుగా పోటీ చేశారు.. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా.. వెంటనే టంగ్‌ ట్విస్ట్ అయ్యింది. ప్రేమ ఉన్నవారే తిట్టుకుంటారు..? కొట్టుకుంటారు..? అంటూ జనసేనాని సెలవిచ్చేశారు.
ఇదేక్కడి రాజకీయమని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు.. అంటే ఇప్పడు తిట్టుకుంటున్న వాళ్లు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టే కదా.

Also Read: Arvind Kejriwal: జరగబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎంత?

ఇవీ మెయిన్ లీడర్స్ పంచాయితీలు.. ఇప్పుడు రెండో స్థాయి నేతల విషయానికి వద్దాం.. టీడీపీలో టికెట్ దక్కని వారు వైసీపీలో చేరారు. వైసీపీలో టికెట్ దక్కని వారు టీడీపీలో చేరారు. కండువాలు మారాయి. పార్టీల పేర్లు మారాయి. అభ్యర్థులు మాత్రం వారే ఉన్నారు. ఇన్నీ చిత్రవిచిత్రాలను చూసే భాగ్యం మాత్రం ఏపీ ప్రజలకే దక్కిందని చెప్పాలి. ఇవాల్టీతో ప్రజలకు వినేబాధ పోయింది. నేతలకు కంఠశోష కూడా పోయింది. మళ్లీ ఎన్నికల ఫలితాలు బయటికి వచ్చే వరకు ఏమీ ఉండదు. ఏమైనా ఫలితాలు అటు ఇటు కాకుండా వస్తే మాత్రం.. ఇప్పుడు సీన్స్ మాత్రమే చూశారు. తరువాత సినిమా చూపించేందుకు కూడా ఏమాత్రం వెనకాడరు మన నేతలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News