Big Stories

Arvind Kejriwal Effect: జరగబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎంత..?

Arvind Kejriwal Effect on Elections 2024: అరవింద్ కేజ్రీవాల్.. ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం.. వీటికి మరో ట్యాగ్ తగిలించింది ఈడీ.. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అని.. అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు తీహార్‌ నుంచి విముక్తి పొందారు. యస్ తాత్కాలికమే.. కానీ చాలా కీలక సమయంలో బయటికి వచ్చారు కేజ్రీవాల్.. ఇన్నాళ్లు అంటే సరిగ్గా 50 రోజుల పాటు జైళ్లో ఉన్నారు కేజ్రీవాల్.. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన గురి ఎవరివైపు పెట్టనున్నారు? మళ్లీ ఆయన జైళ్లోకి వెళ్లేలోపు జరిగే పరిణామాలేంటి?

- Advertisement -

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాములుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో బెయిల్ దొరకడం అనేది అసాధ్యం.. కానీ కేజ్రీవాల్ కేసును స్పెషల్‌గా తీసుకొని మరీ బెయిల్‌ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.. జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్‌ నుంచి రిలీజ్‌ అయ్యారు కేజ్రీవాల్.. జైలుకు వెళ్లడానికి ముందే బీజేపీపై కత్తులు నూరారు కేజ్రీవాల్.. తనపై తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారన్న కోపం పీక్స్‌లో ఉంది ఆయనకు.. అలాంటి కేజ్రీవాల్‌కు మళ్లీ బయటికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే చాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరింత స్పైస్ యాడ్ కానుంది.

- Advertisement -

ముందుగా రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్‌ ఏ మేరకు ఉంటుందో చూద్దాం.. మాములుగా కేజ్రీవాల్ ఎఫెక్ట్‌ ఉన్న రాష్ట్రాల లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది ఢిల్లీ.. ఆ తర్వా పంజాబ్‌, హర్యాణా… ఇక రాజస్థాన్‌, గోవాలో ఉన్నా.. అది చాలా తక్కువ.. సో మూడు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్‌ ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్‌ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడా జోరు మరింత పెరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా దేశ రాజధానిలోని ఏడు సీట్లలో ఆప్ నాలుగు.. మిగిలిన మూడు సీట్లలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

Also Read: ఆ రాష్ట్రంలో ఎంత మంది పోటీ చేస్తున్నారంటే..?

నెక్ట్స్‌ పంజాబ్.. ఇక్కడ 13 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇక హర్యాణాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బట్ ఇప్పుడు కేజ్రీవాల్ ఎంట్రీతో ప్రచార స్టైల్ మారనుంది. అసలు కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చిన టైమింగ్‌ హైలేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆప్‌కు చివరి మూడు దశల పోలింగ్ చాలా ముఖ్యం.. మే 20, 25, జూన్ 1 వీటి పోలింగ్ ఉంది. ఢిల్లీ, హర్యానాల్లో ఆరో దశలో మే 25న.. ఆ తర్వాత పంజాబ్‌లో జూన్ 1న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 2న ఆయన తిరిగి తీహార్‌కు వెళ్లనున్నారు. సో పర్ఫెక్ట్‌ టైమ్‌లో బెయిల్ వచ్చింది కేజ్రీవాల్‌కు..

కేజ్రివాల్ ఇక స్టేజ్ ఎక్కినా.. రోడ్ షో నిర్వహించినా.. దాని ఇంపాక్ట్ అంతా ఇంతా ఉండదు. ఇకపై అటు మోడీని ఇటు బీజేపీని చీల్చి చెండాడటం ఖాయం. ఇప్పటికే ఆయన ఈ పనిని మొదలు పెట్టారు. మరి ఈ పరిణామాలను ఎదుర్కోనేందుకు బీజేపీ ప్రిపేర్డ్‌గా లేదా? అంటే ఉందనే చెప్పాలి.. ఎందుకంటే.. జైలు నుంచి కేజ్రివాల్ బయటకు వస్తే ఆయనే సెంటరాఫ్‌ అట్రాక్షన్ అవుతారని బీజేపీకి కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీకి ఒక్కటే చాయిస్ ఉంది. అది కేజ్రీవాల్‌ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఎట్ ది సేమ్ టైమ్.. ఆయన జైలు నుంచి వచ్చాడు.. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేయడం.. బీజేపీ ఇదే టాపిక్‌పై ప్రచారం చేయనుంది.

Also Read: YCP Candidate manhandling to voter: పోలింగ్ బూత్ వద్ద దారుణం, ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్

బట్ బీజేపీ ఈ స్ట్రాటజీని కేజ్రీవాల్‌ ఈజీగా ఓవర్‌కమ్ చేస్తారనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఓ మంచి వక్తి.. ఆయన ప్రచార స్టైల్ విద్య, ఉద్యోగం అన్నట్టుగా ఉంటుంది. నేను సామాన్యుడిని.. సామాన్యుల కోసమే పని చేస్తా అన్నట్టుగా సాగుతుంది ఆయన ప్రచారం. రియాల్టీ ఎలా ఉన్నా.. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఇదే ట్రేండ్.. దీనికి ప్రజలు ఈజీగా కనెక్ట్ అయ్యే చాన్స్ ఉంది. అంతేకాదు.. ఈ ఎన్నికలను కేజ్రీవాల్ ఓ రెఫరెండంగా భావించే చాన్స్ ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తీహార్‌ జైల్లో ఉన్నా కూడా.. ప్రజలు తనను ఓ వారియర్‌గా భావిస్తారన్న ఆశలో ఉన్నారు కేజ్రీవాల్.. అయితే దీనికి ఆన్సర్‌ అంత వెంటనే చెప్పలేము.. జూన్ 4 వరకు ఆగాల్సిందే..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News