Gopi Thotakura becomes first Indian Space Tourist: తొలి తెలుగు వ్యక్తి చేసిన అంతరిక్షయాన ప్రయోగం విజయవంతం అయ్యింది. అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టినటువంటి అంతరిక్షయాన ప్రయోగం సక్సెస్ అయ్యింది.
అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి న్యూ షెపర్డ్ 25 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో తెలుగు వ్యక్తి గోపీచంద్ తో సహా మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలోనే అంతరిక్షంలో చేరుకున్నవారంతా కాసేపు భారరహిత స్థితిని పొందారు. ఆ తరువాత క్యాప్సూల్ లో సక్సెస్ ఫుల్ గా తిరిగి భూమిని చేరుకున్నారు. దీంతో రోదసీలోకి వెళ్లి వచ్చిన తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ నిలిచారు.
గోపీచంద్ తోపాటు మొత్తం ఆరుగురు వెళ్లారు. అమెరికాకు చెందిన తొలి నల్ల జాతీయ వ్యోమగామి ఎడ్ డ్వైట్, పారిశ్రామికవేత్త సిలైన్ చిరోన్, వెంచర్ క్యాపిటలిస్ట్ అయినటువంటి మాసన్ ఏంజెల్, అమెరికాకు చెందిన వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికుడైన కరోల్ షాలర్ లు అంతరిక్షయానం చేసినవారిలో ఉన్నారు. అయితే, అంతరిక్షయానం చేసినవారిలో అత్యంత పెద్ద వయస్కుడు ఎడ్ డ్వైట్. ఈయన వయస్సు 90 ఏళ్లు. అయితే, ఆయన 1961లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు. కానీ, పలు కారణాల వల్ల అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం రాలేదు. అయితే ఎట్టకేలకు ఆయనకు 90 ఏళ్ల వయసులో ఆ అవకాశం వచ్చింది. చివరకు ఆయన కల నెరవేరింది. ఈ సందర్భంగా అంతరిక్షయానం చేసిన వారు మాట్లాడుతూ తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Also Read: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్..?
అయితే, రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, రాజా చారి, సునీతా విలయమ్స్, శిరీష్ వీళ్లంతా కూడా అంతరిక్షయానం చేసివారే అయినప్పటికీ వీరు భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం భారత పౌరుడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన భారత పాస్ పోర్టునే కలిగి ఉన్నాడు. దీంతో ఆయన భారత తొలి స్పేస్ టూరిస్ట్ గా చరిత్రకెక్కాడు. న్యూ షెపర్ట్ పేరిట బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసీ యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రయోగించిన ప్రయోగం ఏడోది. అయితే, మానవసహిత అంతరిక్ష ప్రయోగం చేపట్టడం 2022 తరువాత ఇదే మొదటిసారి. 2021లో బెజోస్ సహా ముగ్గురు రోదసీలోకి వెళ్లివచ్చిన విషయం తెలిసిందే.
బ్లూ ఆరిజన్ స్పెషల్ ఇదే..
అంతరిక్షంలో తేలియాడేటువంటి అంతరిక్ష కాలనీలను నిర్మించాలన్న లక్ష్యం బెజోస్ కు ఉండేది. ఈ క్రమంలో ఆయన 2000 లో బ్లూ ఆరిజిన్ ను స్థాపించాడు. రోదసీలో కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, ఆ తరువాత లక్షల మంది పని చేసుకుంటూ జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను తయారుచేయాలని బెజోస్ లక్ష్యాంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా న్యూ గ్లెన్ అనే భారీ రాకెట్ ను అభివృద్ధి చేసే పనిలో బ్లా ఆరిజిన్ ప్రస్తుతం నిమగ్నమైంది. చంద్రడిపై దిగేటువంటి ల్యాండర్ ను తయారు చేయాలని, అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా చేపట్టే ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగం కావాలని బ్లూ ఆరిజిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.