Big Stories

YS Sharmila Vs CM Jagan: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?

Will Sharmila Defeat Jagan in Kadapa AP Election 2024: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగింపుకొచ్చింది. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచార గుడువు ముగియనుంది. దాంతో అన్ని పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. వీలైనన్న ఎక్కువ నియోజకవర్గాల్లో తిరిగేస్తున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. రోజుకి మూడు నాలుగు మీటింగుల్లో ప్రసంగిస్తున్న చంద్రబాబు, జగన్‌లు ముగింపు దశలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, షర్మిలలు చివర్లో తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.

- Advertisement -

ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అన్ని పార్టీల అధ్యక్షులు దూకుడు పెంచుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరోజే అయిదు నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం మూడు నియోజకవర్గాలు చుట్టేశారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో మకాం వేసిన జనసేన అధ్యక్షుగు పవన్ కళ్యాణ్ అక్కడే రోడ్‌షోలు, సభలంటూ హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సైతం తాను పోటీ చేస్తున్న కడప లోక్‌సభ సెగ్మెంట్లో స్పీడ్ పెంచుతున్నారు.

- Advertisement -

ఇప్పటి వరకు ప్రతి రోజు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మూడు సభల్లో పాల్గొని ప్రచారం చేశరు.. చివరి రోజు కూడా జగన్ మూడు సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు .. ప్రజాగళం పేరుతో చంద్రబాబు పాల్గొంటున్న సభల సంఖ్య ప్రచారం ముగిసేసరికి 90కి చేరనుంది… ప్రచారం చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఎవరికి వారు వేగం పెంచి దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి చంద్రబాబు ప్రసంగాల్లో ఒకింత బేలతనం కనిపించింది. తన సహజశైలికి భిన్నంగా సభా వేదికల మీద నుంచి వంగివంగి దణ్ణాలు పెట్టి ఓట్ల కోసం అభ్యర్ధించారు టీడీపీ అధినేత .. అయితే ఈ సారి ఆయన నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటున్నారు. సంక్షేమపథకాలకు అడ్డంపడుతున్నారని విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. జగన్ స్పీచ్‌లు చూస్తుంటే  క్లైమాక్స్‌లో తడబడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Also Read: తుది దశకు ప్రచారాలు.. ఓటర్లకు ప్రలోభాల ఎర.?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి వైసీపీపై యుద్దం ప్రకటించింది. మొన్నమొన్నటి వరకూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా జగన్ మరోసారి మోడీ అధికారంలోకి వస్తారని చెప్పారు … ఇలా చెప్పడం ద్వారా బీజేపీ అగ్రనేతలు తనపై దూకుడు ప్రదర్శించరని ఊహించారు. కానీ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం ఓ రేంజ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.  ఏపీలో కూటమి తరపున రెండో సారి ప్రచారానికి వచ్చిన ప్రధాని స్వయంగా జగన్‌ని టార్గెట్ చేశారు.

కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు పడింది.. దానికి తోడు మోడీ ఎదురుదాడి మొదలై. ఒక్కసారిగా సీన్ మారడంతో జగన్ వాయిస్‌లో మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని.. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు.

మరోవైపు పేదలకు సంక్షేమం అందకుండా కూటమి కుట్రపూరిత రాజకీయలు చేస్తోందని సీఎం జగన్‌ ఆరోపణులు గుప్పిస్తున్నారు …పేదలకు సంక్షేమం అందకూడదని కోర్టులకు వెళ్లి కేసులు వేసే పరిస్థతి వచ్చిందంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తే అది తన గొంతును నొక్కడం కాదు కానీ.. పేదలు, విద్యార్థులు,రైతులు, మహిళల గొంతు నొక్కడమేనని జగన్‌ సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక నిండా మునిగినోడికి చలేంటి అనుకుంటున్నారో ఏమో.. చివరి దశ ప్రచారంలో మోడీ, అమిత్‌షాలను కూడా జగన్ టార్గెట్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీ, అమిత్ షా ఎలా ఏపీ వస్తున్నారో చెప్పాలని ఏపీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. 2014లో ప్రజలకు న్యాయం చేయని డబుల్ ఇంజన్ సర్కార్ 2024 తర్వాత ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు విపక్షాల కూటమిపై అక్కసు వెళ్లగక్కుతున్న జగన్ .. తన ప్రసంగాల్లో మాత్రం వైనాట్ వన్ సెఫన్టీ ఫైవ్ (175) స్లోగన్‌ని మాత్రం మర్చిపోవడం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News