ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గం. పాలకొండ నుంచి మొదటిసారి పీఆర్పీ నుంచి పోటీ చేసిన విశ్వాసరాయి కళావతి 2009లో ఓడిపోయారు. తర్వాత కళావతి వైసీపీలో చేరి.. ఆ పార్టీనే నమ్ముకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. పార్టీకి నమ్మకంగా ఉండటంతో జగన్మోహన్‌రెడ్డి 2014లో విశ్వాసరాయి కళావతి పాలకొండ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా పాలకొండలో కళావతి విజయం సాధించారు. పాలకొండ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ క్రమంలో ఆమెపై సెగ్మెంట్లో గుడ్‌విల్ పెరిగింది.
2019 ఎన్నికలో కూడా వైసీపీ టికెట్ దక్కించుకున్న ఆమె రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే రెండో సారి గెలిచాక కళావతి నియోజకవర్గ సమస్యలు.. అభివృద్ధి పై దృష్టి పెట్టడం మానేశారనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమౌతుంది. ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజల బాగోగులు గురించి ఆమె ఎంతో కొంత ఆలోచించే వారని పార్టీ అధికారంలోకి రాగానే ఆమె వైఖరే మారిపోయిందని నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కడప కోటలో గెలిచేదెవరు.. అవినాష్ కు ఓటమి తప్పదా?
సమస్యల పరిస్కారం కోసం.. చిన్న చిన్న అవసరాలకోసం వచ్చే ప్రజల పై కళావతి అసహనం.. కోపం వ్యక్తం చేస్తున్నారంట. రెండవ సారి గెలిచిన తరువాత ప్రజాసమస్యలను గాలికి వదిలేసారనే ఆగ్రహం పాలకొండ వాసుల్లో వ్యక్తమవుతుంది. పాలకొండ నియోజకవర్గంలో మిగిలిన సామాజిక వర్గాలతో పాటు గిరిజనులు కూడా అధికంగా ఉన్నారు. ఎస్టీ అయి ఉండి కూడా ఎమ్మెల్యే గిరిజన ప్రజల సమస్యలు అసలు పట్టించుకోలేదని గిరిపుత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతమైన భామిని మండలంలో నిత్యం ఏనుగులు జనావాసలపైకి పంటల్ని నాశనం చేస్తున్నాయని కళావతికి చెప్పినా స్పందించ లేదని గిరిజనులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో మండలం సీతంపేటలో ఎన్నో ఏళ్ళగా తాగునీటి సమస్య గిరిపుత్రులను వేధిస్తోంది. ఆ సమస్య ఓరిష్కరించాలని ఎమ్మెల్యేకి ఎన్ని సార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని సీతంపేట గిరిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
రెండో సారి గెలిచాక కళావతి నియోజకవర్గానికి చేసింది ఏమిలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగానే ఉంది. ముక్యంగా వీరఘట్టం మండల హెడ్ క్వాటర్ లో రోడ్లు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ధ్వంశమైన రోడ్లపై ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడటంతో పాటు.. గాయాల పాలవుతున్నా ఎమ్మెల్యే నిర్లక్ష్యంా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి పాలకొండ నియోజకవసర్గ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. మరో వైపు పాలకొండకు రావాల్సిన సూపర్ స్పెసాలిటీ ఆసుపత్రిని ఆమె సీతంపేట తరలించడంపై కూడా పాలకొండ నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ది శంకుస్థాపనలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదీకాక పాలకొండ నియోజకవర్గంలో పేరుకే కళావతి ఎమ్మెల్యే అని.. తెరవెనుక నడిపిస్తుంది అంతా.. ఎమ్మెల్సీ విక్రాంత్ అన్న ప్రచారం ఉంది. విక్రాంత్ అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఒక్క పనికుడా ముందుకు సాగదంట. ఎమ్మెల్యే కళావతి ఏ పని చేయాలన్నా .. ముందుగా విక్రాంత్ అనుమతి తీసుకోవాల్సిందే నంట. ఆ విధంగా విక్రాంత్ పాలకొండ నియోజకవర్గం షాడో ఎమ్మెల్యేగా తన పెత్తనం నడిపిస్తున్నారంటున్నారు.
Also Read: రోజా Vs జబర్దస్త్ టీమ్
ఓవైపు ఎమ్మెల్యే కళావతి నిర్లక్యం.. మరో వైపు ఎమ్మెల్సీ విక్రాంత్ పెత్తనంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతుంది. అది ప్రస్తుత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి నిమ్మక జయకృష్ణకు కలిసివచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో నిమ్మక జయకృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కళావతి చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. దాంతో జయకృష్ణపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది.
జయకృష విద్యావంతుడవ్వడంతో పాటు.. పిలిస్తే పలికే స్వభావం ఉన్న వ్యక్తి గా మంచి పేరుంది. ఈ సారి పొత్తుల్లో భాగంగా పాలకొండ జనసేనకు దక్కడంతో జయకృష్ణ జనసేన తరఫున పోటీకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో కూటమి బలం జయకృష్ణకు ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయనకి కలిసివచ్చే అవకాశముందన్న వాదన కూడా వినిపిస్తుంది. మరి చూడాలి పాలకొండ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో?