Big Stories

Memory Loss : హలో బాసూ.. మనకి మెమరీ లాసు..!

Memory Loss : రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా మనమందరం చూసే ఉంటాం. అందులో మన హీరో గతం మరచిపోయినట్లుగా యాక్ట్ చేస్తుంటాడు. అది మనకు చూడటానికి కామెడీగా అనిపించినా.. నిజ జీవితంలో అలాంటి ఘటనలు జరిగితే చాలా కష్టం. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అందరి పరిస్థితి ఇలానే మారింది. కనీసం చిన్నచిన్న విషయాలు కూడా గుర్తుండటం లేదు. సులభంగా నోటితో చెప్పాల్సిన లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్ ఉపయోగించి చేసే పరిస్థితికి తెచ్చుకున్నాం.

- Advertisement -

దీనివల్ల మెదడు పనిచేసే స్వభావాన్ని కోల్పోతుందని.. మీకు తెలుసా..? గల కొంతకాలంగా మతిమరుపుతో మాట్లాడే వారి సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. పరిస్ధితులు ఇలానే ఉంటే ఓమియో.. గజినీ ఓమియో.. గజినీలా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మెదడు అనేది మెమొరీ కార్డు లాంటిది. ఇది ప్రతి క్షణం మన శరీరానికి ప్రోగ్రామింగ్ అందిస్తూ ఉంటుంది. దీని ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. మన జ్ఞాపకాల దగ్గర నుంచి అనుభూతుల వరకూ మెదడు చేసే అద్భుతమైన పనే ఇది. మెదడుకు స్వతహాగా పనిచేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం ద్వారానే మనిషి మేథో సంపత్తిని అంచనా వేయొచ్చు.

కానీ ఈ మేథో సంపత్తి కాస్త పక్కదారి పడితేనే ప్రమాదం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. దీనివలనే మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. తలనొప్పి, అకస్మాత్తుగా పెరిగే బీపీ, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం, అకారణంగా ఎదుటివారితో గొడవ పడటం వంటి లక్షణాలు ఇందుకు కారణం కావచ్చు.

మరి కొందరు అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్మార్ట్ ఫోన్‌ నోట్‌పాడ్‌లో రాసుకుంటుంటారు. దీని ఆధారంగానే వారు రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం ద్వారా మెదడు ప్రభావవంతంగా పనిచేయడం మానేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక మనిషి మెదడు పనితీరుపై మరింత ప్రభావం పడుతుంది.

మెదడు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తే మనషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితంలో క్రమేపి మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. స్మార్ట్ ఫోన్ వినియోగించే వారిలో న్యూరో సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్‌కు బానిసకావడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు ఉండడం లేదు.

మనం ప్రతి చిన్న విషయానికి ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఆధారపడటం మంచిది కాదు. దీనివల్ల మెదడు మొద్దు బారిపోతోంది. స్మార్ట్ చదువుల ప్రభావం వల్ల పిల్లలు కూడా మేథో సంపత్తిని కోల్పోతున్నారు. నలుగురితో కలిసి ఉండలేకపోతున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడటం వల్ల చురుకుదనాన్ని కోల్పోయి.. బద్ధకంగా తయారవుతున్నారు. కాబట్టి కిక్‌లో రవితేజ అవుతారో.. జులాయి సినిమాలో బన్నిలా అవుతారో డిసైడ్ చేసుకోండి..!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News