E-Paper
Advertisement

Entertainment:పూరి-రామ్ ఇద్దరికీ ‘డబుల్’ ట్రబుల్?

Entertainment:పూరి-రామ్ ఇద్దరికీ ‘డబుల్’ ట్రబుల్?
Advertisement

Hero Ram ..Director Puri carrier depends upon Double Ismart movie

కొన్ని కాంబినేషన్లు రిలీజ్ కు ముందే అంచనాలు పెంచేస్తుంటాయి. ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఏదైనా హిట్ పడిందంటే మరోసారి అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2019లో ఇదే కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఊర మాస్ క్యారెక్టర్ లో రామ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పూరీ కూడా ఓ రేంజ్ లో ఈ సినిమాను ఎంతో కసిగా తీశాడు. అయితే ఈ మధ్యకాలంలో రామ్ పోతినేనికి ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మరో సినిమా ఏదీ పడలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద కూడా యావరేజ్ గానే మిగిలింది. ఇప్పుడు ఓ హిట్ మూవీ పడటం రామ్ కెరీర్ కి అత్యావశ్యం.

Advertisement

పూరీకి లైఫ్ అండ్ డెత్

దర్శకుడు పూరీకి సైతం ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ మూవీ పడలేదు. విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ భారీ నష్టాలనే చవిచూసింది. చాలా చోట్ల సొంతంగానే ఈ మూవీపై నమ్మకంతో రిలీజ్ చేసి తీవ్ర ఆర్థిక నష్టాలతో అప్పులపాలయ్యాడు పూరీ. మహేష్ బాబుతో మూవీ కూడా ఆగిపోవడానికి అదే కారణం అని ఇండస్ట్రీ అంతా గుసగుస.ఇప్పుడు ఈ ఫ్లాప్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఇద్దరి కెరీర్ కూ ముఖ్యమే.బిజినెస్ పరంగా ఈ మూవీకి బాగానే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రోమోలు, పాటలు, పోస్టర్లు ఈ మూవీపై అంచనాలు సైతం ‘డబుల్’ చేశాయి. డబుల్ ఇస్మార్ట్ హిట్ కాకుంటే వీళ్లిద్దరి కెరీర్ ట్రబుల్ లో పడుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను పూరీ, రామ్ అందుకోగలరా? అని సినీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×