BigTV English

Manam chocolaterie: టైమ్ జాబితాలో హైదరాబాద్ ‘మనం’ చాక్లెట్, వెస్ట్ గోదావరి నుంచి..

Manam chocolaterie: టైమ్ జాబితాలో హైదరాబాద్ ‘మనం’ చాక్లెట్, వెస్ట్ గోదావరి నుంచి..

Manam chocolaterie: టైమ్ మేగజైన్ గురించి చెప్పనక్కర్లేదు. ఇందులో చోటు సంపాదించుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరుతారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులనే కాదు వైవిధ్యంగా నిలిచిన హోటల్స్, రెస్టారెంట్లు, మ్యూజియంలు, పార్క్‌ల వంటి వాటిని టైమ్ మేగజైన్ ఏటా విడుదల చేస్తోంది. ఈసారి హైదరాబాద్‌కు చెందిన మనం చాక్లెట్ అందులో చోటు సంపాదించుకుంది.


హైదరాబాద్‌లోని ‘మనం’ చాక్లెట్ గురించి వర్ణించలేము. చాక్లెట్ ప్రేమికులకు మనం అనేది స్వర్గధామం. అందులో పేరుపొందిన రకరకాల చాక్లెట్ రుచులకు ఈ ఖార్ఖానా పుట్టినిల్లు. రుచులను ఆస్వాదించడంతో పాటు కోకోగింజలను చాక్లెట్‌‌గా మార్చే ప్రక్రియ మొత్తాన్ని అక్కడ చూడొచ్చు. అంతేకాదు వాటిని తయారు చేసే సిబ్బందితో మాట్లాడవచ్చు. కోకో, చాక్లెట్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవచ్చన్నది అక్కడికి వెళ్లనవారి మాట.

ఇక్కడ దాదాపు 300 రకాలకు పైగా చాక్లెట్లు ఉంటాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చాక్లెట్ – కోకో టెస్టింగ్ నుంచి సర్టిఫికెట్ పొందింది మనం ఖార్ఖానా. అంతేకాదు ఇండియాలో మూడింటిలో సర్టిఫైడ్ చాక్లెట్‌గా గుర్తింపు సాధించింది కూడా. వీటిని భారతీయులకు అందించాలనే లక్ష్యంతో గతేడాది మనం చాక్లెట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నది నిర్వాహకుల మాట. మనం ఖార్ఖానాకు వచ్చిన అవార్డు అన్నీఇన్నీకావు.


ALSO READ: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

స్విస్ లేదా బెల్జియం చాక్లెట్లు మాంచి పేరుంది. ఇప్పుడు ఆ జాబితాలో మనం చాక్లెట్ కూడా చేరిపోయి నట్టే. అన్నట్లు దీనికి రామెటీరియల్ వెస్ట్ గోదావరి జిల్లాలో రైతులు పండించిన కోకోతో వీటిని తయారు చేసింది మనం చాక్లెట్. ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుని టైమ్ మేగజైన్‌లో చోటు సంపాదించుకుంది. మనంతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్ రెస్టారెంట్ స్థానం దక్కించుకుంది.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×