Big Stories

Alarm Clocks : ఈ అలారం ఆపాలంటే.. పరిగెత్తాల్సిందే!

Running Alarm Clock

Alarm Clocks : ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడానికి చాలామంది అలారం పెట్టుకుంటారు. అది మోగగానే ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటుంటారు. దీంతో వారి రోజువారి పనులు ఆలస్యమవుతాయి. ఆ సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టెక్నాలజీ అలారం క్లాక్స్. వీటిని ఆపాలంటే.. లేచి పరిగెత్తాల్సిందే. లేదంటే ఇళ్లంతా మోగుతూ తిరిగేస్తుంటాయి. వీటి ప్రయోజనాలు ఇలా..

- Advertisement -

రన్నింగ్ ఎవే అలారం క్లాక్

- Advertisement -

ఇది పేరుకు తగ్గట్లే.. పారిపోయే అలారం క్లాక్. బ్యాటరీతో నడిచే ఈ డిజిటల్ అలారం క్లాక్‌కు ఇరువైపులా రెండు చక్రాలుంటాయి. దీనిలో అలారం సెట్ చేసుకుంటే.. టైంకు మోగుతూ ఇళ్లంతా తిరుగుంటాయి. మీరు దీన్ని ఆపాలంటే.. దాని వెంట పరిగెత్తాల్సిందే. ఆన్‌లైన్‌లో దీని ప్రారంభ ధర రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది.

ఫ్లైయింగ్ ఎవే అలారం క్లాక్

ఈ అలారం క్లాక్స్ పరిగెత్తవు. కానీ గాలిలో ఎగురుతాయి. దీనిలో అలారం మోగగానే దీనిపైన ఉండే ఫ్యాన్‌‌తో.. డ్రోన్‌ మాదిరిగా గాల్లో ఎగురుతూ గోల చేస్తుంది. దీంతో దీన్ని ఆపేందుకైనా మీరు లేవాల్సిందే. ఆన్‌లైన్‌లో దీని ప్రారంభ ధర రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News