Big Stories

Sunscreen effect in Summer: ఎండాకాలం అని సన్ స్క్రీన్ ఎక్కువగా వాడేస్తున్నారా.. ఈ సమస్యల బారిన పడినట్లే!

Effects of sunscreen
Effects of sunscreen

Effects of Sunscreen in Summer: ప్రస్తుత కాలంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చర్మ సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ తరుణంలో చర్మాన్ని రక్షించుకునేందుకు ఏది పడితే అది వాడేస్తుంటారు. ఎంత ఖర్చు అయినా సరే లెక్క చేయకుండా వేల రూపాయలు ఖర్చు చేసి క్రీములు కొనేస్తుంటారు. ఈ తొందరపాటులో అందులో ఉండే రసాయనాలు ఏంటి అనే వాటిని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ముఖ్యంగా యూవీ రేస్ నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్‌ను ఇటీవల కాలంలో ఎక్కువగా వాడుతున్నారు. అందులోను ఇది వేసవికాలం కాబట్టి సన్ స్క్రీన్‌ను ఎక్కువగా వాడేందుకు చూస్తారు. ఎండలో తిరిగి చర్మం అంతా టాన్‌తో నింపుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ముందుగానే ముఖానికి అవసరానికి మించిన సన్ స్క్రీన్‌ను పూసేస్తుంటారు. అందువల్ల ఎటువంటి సమస్యలు రావని భావిస్తారు.

- Advertisement -

సన్ స్క్రీన్‌ వాడకం పెరిగిపోవడంతో మార్కెట్లోకి కూడా రసాయన ప్రొడక్ట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటి వల్ల ముఖాన్ని కాపాడుకోవడం కంటే మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తక్కువ ధరకే వస్తున్నాయని క్వాలిటీ లేని ప్రొడెక్ట్ కొనుక్కుని ముఖాన్ని పాడు చేస్తున్నారు. అయితే ముఖానికి అవసరానికి మించిన సన్ స్క్రీన్‌ను పూసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్ స్క్రీన్‌ వాడకం వల్ల చర్మానికి కలిగే నష్టాలే ఎక్కువని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

సన్ స్క్రీన్‌ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు..

1. మొటిమలు

సన్ ప్రొటెక్షన్‌గా పిలుచుకునే సన్ స్క్రీన్‌ ప్రస్తుతం చర్మ సౌందర్యానికి ఇబ్బందులు కలిగిస్తుంది. సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు పూసుకునే సన్ స్క్రీన్‌ మొటిమలను పెంచుతుంది. సిన్నమేట్స్, ఆక్సీబెంజోన్, ఆక్టోక్రిలిన్ వంటివి ఈ క్రీముల్లో ఉంటాయట. వీటిని ఉపయోగించడం వలన మొటిమలను పెంచుతాయట.

Also Read: Idli : ఇడ్లీ తింటున్నారా?.. ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోండి!

2. సన్ స్క్రీన్‌‌తో కంటి సమస్య

సన్ స్క్రీన్‌ అధిక మోతాదులో వాడడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి దీనిని వాడుతున్నపుడు కళ్లలో మంటపుడుతుంది. తొలుత మంట కలిగి ఆ తర్వాత కళ్లు ఎరుపెక్కుతాయి. ఇలా తరచూ జరగడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.

3. క్యాన్సర్

సన్ స్క్రీన్‌‌లో ఉపయోగించే రసాయనాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రీముల్లో ఉండే ఆక్సీబెంజోన్, బెంజోఫెనోన్-3వంటి రసాయనాల మూలంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. వీటిని తరచూ ఉపయోగించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News