BigTV English

Idli : ఇడ్లీ తింటున్నారా?.. ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోండి!

Idli : ఇడ్లీ తింటున్నారా?.. ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోండి!
Idli
Idli

Idli : ఇడ్లీని ఇష్టపడని వారెవరుండరు. మనలో చాలామంది వారి రోజుని ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తారు. వేడివేడి ఇడ్లీలో పొగలు రేగుతున్న టేస్టీ సాంబార్ వేసుకొని.. స్వారీ స్వారీ పొసుకొని తింటుంటే అబ్బా ఆ ఫీల్ చెప్పలేనిది. ఈ కాంబినేషన్ అంటే చాలా మందికి పిచ్చి అని చెప్పొద్దు. ఇక ఇడ్లీని మంచి రుచికరమైన చెట్నీతో కూడా తీసుకోవచ్చు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీ చాలా ఫేమస్. రకరకాల ఇడ్లీలను తయారు చేస్తుంటారు. సాంబార్ ఇడ్లీ, చెట్నీ ఇడ్లీ, కారం ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ ఇలా అనేక వెరైటీలు ఉంటాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మినప ఇడ్లీ, తమిళనాడులో కుడుం ఇడ్లీ, కర్ణాటకలో తట్ట ఇడ్లీ, కేరళలో కొబ్బరి నూనె ఇడ్లీ ఎంతో ప్రత్యేకమైనవి. ఇడ్లీ సులభంగా జీర్ణం అవుతుందని, ఆరోగ్యానికి మంచిదని అదేపనిగా వీటిని తింటుంటారు. అయితే ఈ ఇడ్లీ వల్ల వాతావరణం దెబ్బతింటుందట. ఆ ప్రమాదం ఏంటో ఇప్పుడే చూద్దాం..


ఆవిరికి ఉడికించిన ఇడ్లీలతో ప్రమాదం ఏంటని అనుకుంటున్నారా..? కొందరు నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 151 వంటకాలపై పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరిశోధనల్లో షాకింగ్ నిజాలు భయటపడ్డాయి. వాతావరణంపై చెడు ప్రభావం పడుతుందని తేలింది. దేశంలో ఎక్కువగా తినే ఇడ్లీ, వడ, చపాతి, చనా మసాలా సహా మరికొన్ని ఆహార పదార్థాలపై పరిశోధకులు అధ్యయనాలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం.. శాఖాహార వంటలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవనశైలిపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు.

Also Read :  చెరుకురసంతో ఎన్నో బెనిఫిట్స్.. వీళ్లు మాత్రం తాగకూడదు


అయితే పరిశోధకులు ఓ మంచి విషయం కూడా తెలిపారు. మన వంటకాలలో బియ్యం, పప్పు ధాన్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఆరోగ్యానికి లాభాలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. బ్రెజిల్ దేశంలో ఉపయోగించే పశువుల మాంసం, స్పెయిన్ దేశానికి చెందిన రోస్ట్ లాంబ్ డిష్, బ్రెజిల్ దేశానికి చెందిన లెచావో వంటి ఆహార పదార్థాల వల్ల వాతావరణానికి ఎక్కువగా ముప్పు ఉంది. అలానే చాలామంది ఎక్కువగా ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ పరాటా, దోశ, ఇడ్లీ, బోండా వంటి వాటివల్ల కూడా పర్యావరణానికి ముప్పు ఉందని తేలింది.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో 25 రకాల వంటకాలు పర్యావరణం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. చెప్పాలంటే వంటకాలు ప్రాంతాల ఆధారంగా ఏర్పడ్డాయి. ప్రతి వంటకాన్ని మనుషులు ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ పదార్థాలు పరోక్షంగా వాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల అడవి జాతులు, క్షీరదాలు, పక్షులు జీవనంపై ప్రభావం పడుతుంది.

Disclaimer: ఈ కథనాన్ని నిపుణులు సలహా మేరకు రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×