BigTV English

Myanmar Junta: తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న మయన్మార్ సైన్యం: UN ప్రత్యేక ప్రతినిధి ఆండ్రూస్

Myanmar Junta: తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న మయన్మార్ సైన్యం: UN ప్రత్యేక ప్రతినిధి ఆండ్రూస్

MyanmarMyanmar Junta: మయన్మార్ సైన్యం ప్రస్తుతం తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటందని యూఎన్ ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ తెలిపారు. దాన్ని ఆ ముప్పు తప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మయన్మార్ పై చాలా దేశాలు ఆంక్షలు విధించారని తెలిపారు. 2021లో అధికారంలోకి వచ్చిన జుంటా దళాలు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అణిచి వేశాయని వెల్లడించారు.


మయన్మారు జుంటాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని యూఎన్ ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ తెలిపారు. దీన్ని సమర్ధవంతంగా అంతం చేయడానికి ప్రపంచం దేశాలు సహాయం చేయాలని అన్నారు. కొన్ని ఆంక్షలు విధించడం ద్వారా అది సాధ్యం అవుతుందన్నారు. జుంటా దళాల మధ్య భారీ ప్రాణనష్టం, ఫిరాయింపులు, లొంగుబాట్లు కారణంగా అవి బలహీన పడుతుందని వెల్లడించారు. ముఖ్యంగా రిక్రూట్ మెంట్ సవాళ్లను ఎదుర్కొనడంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని వెల్లడించారు.

ఫిబ్రవరి 2021లో తిరుగుబాటు చేసి జుంటా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత గత పదేళ్లుగా అక్కడి అధికారంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని నాశనం చేసిందని వెల్లడించారు. దీని కారణంగా దేశాన్ని మరోసారి రక్తశిక్తం చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో దీర్ఘకాలంగా ఉన్న జాతి తిరుగుబాటు దళాలను అణిచివేయడానికి ప్రస్తుతం జుంటా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో హింస, అస్థిరత, ఆర్థిక క్షీణత ఏర్పాడడానికి ప్రధాన కారణం జుంటా అని ఆండ్రూస్ వెల్లడించారు.


Also Read: Deep Fake Video: ఇటలీ ప్రధాని డీప్ ఫేక్ వీడియో.. రూ. 90 లక్షలు డిమాండ్

జుంటూ సింగపూర్ అందించే ఆయుధాల సరఫరాను చాలా వరకు తగ్గించిందని అన్నారు. ప్రస్తుతం జుంటాకు చైనా, రష్యా దేశాలే ప్రధానంగా ఆయుధ సమాగ్రిని సరాఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆదేశంలో ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక సంబంధాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరం ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచం ఇతర ఘర్షణపై తన కేంద్రీకరించడం వల్ల మయన్మార్ పై తమ దృష్టి సన్నగిల్లిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్య, మానవ హక్కులను గౌరవించే మయన్మార్ ను నిర్మించడం చాలా అవసరం అని ప్రపంచ దేశాలకు తెలిపారు. అక్కడి ప్రజల మద్దతుగా అని దేశాలు సహకరించాలని కోరారు.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×