Big Stories

Banana Peel Benefits: అరటి తొక్కతో అందం మీ సొంతం!

Benefits of Banana Peel: పండ్లలో సీజన్ అనే తేడా లేకుండా దొరికే పండు అంటే అరటి పండు. ఇది ఏ సీజన్ లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది. అంతేకాదు ఈ పండును ఇష్టపడని వారెవరు ఉండరు. దేవుడి ప్రసాదాలతో మొదలుకుని ఇంట్లో తినే ప్రతి పండ్లలో ఈ పండు కనిపిస్తుంది. అయితే అరటిపండును దేవుడి నైవేద్యానికి లేదా ఏదో తినడానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారు. అయితే అరటిపండుతో మాత్రమే చర్మ సౌందర్యం పొందవచ్చనేది పొరపాటు. అరటి పండు తొక్కతోను శరీరం అంతా మెరిసేలా చేసుకోవచ్చట. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

ఫేస్ మసాజ్..

- Advertisement -

అరటి పండు తొక్కతో ఫేస్ మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అరటి పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో అంతే మోతాదులో అరటి తొక్కలోను ఉంటాయట. ఫైబర్, కాల్షియం, జాంక్, బీ12,6, మెగ్నీషియం వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు అరటి తొక్కలో ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు తోడ్పడతాయి. చర్మానికి అరటి తొక్కతో మసాజ్ చేయడం వల్ల చర్మం తలతలా మెరుస్తుంది.

Also Read: World Liver Day: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఈ ఫుడ్ తినాల్సిందే

మరోవైపు అరటి తొక్కకు తేనెను కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు వదిలేయాలి. అనంతరం ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల ముఖం మెరుస్తుంది. దీనిని మరొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అరటి తొక్కలను బాగా గ్రైండ్ చేసి అందులో ఓట్ మీల్, రెండు చంచాల షుగర్, పసుపు, తేనె కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. అనంతరం దానిని ముఖానికి, కాళ్లకు, చేతులకు అప్లై చేసుకుని తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News