BigTV English

IPL 2024 – MI Vs PBKS Highlights: ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు.. పంజాబ్ పోరాట స్ఫూర్తికి జేజేలు..!

IPL 2024 – MI Vs PBKS Highlights: ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు.. పంజాబ్ పోరాట స్ఫూర్తికి జేజేలు..!

మొదట టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే 192 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కి దిగిన పంజాబ్ ఒక దశలో 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడి గిలగిలా కొట్టుకుంది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ మొదట గోల్డెన్ డక్ తో మొదలెట్టాడు. తర్వాత రిలీ రొస్సోవ్ (1), లివింగ్ స్టన్ (1), కెప్టెన్ శామ్ కర్రన్ (6) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవెలియన్ కి.. క్యూ కట్టేశారు.


అందరూ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు. గుజరాత్ టైటాన్స్ కి ఎదురొచ్చింది రా.. అనుకున్నారు. వాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ తో 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే నెమ్మదిగా కోలుకున్నట్టు కనిపించింది. 9.2 ఓవర్లకు వచ్చేసరికి 6 వికెట్ల నష్టానికి 77 పరుగులతో ఊపిరి పోసుకుంది.

హర్ ప్రీత్ సింగ్ (13), జితేష్ శర్మ వీరు కూడా నిరాశ పరిచారు. ఈ దశలో శశాంక్ సింగ్, అశుతోస్ శర్మ ఇద్దరూ ఎవరూ ఊహించని రీతిలో మ్యాచ్ ని ముందుకు తీసుకువెళ్లారు. ముంబయి బౌలింగుని తుత్తు నియలు చేశారు. ఒక దశలో మ్యాచ్ గెలుస్తుందనే అనుకున్నారు. ఎందుకంటే చివరికి 6 బాల్స్ 10 రన్స్ కి మ్యాచ్ వచ్చేసింది.

Also Read: HYD IPL tickets in black: ఐపీఎల్ టికెట్ల వ్యవహారం.. బుక్కైన ఐటీ ఉద్యోగులు

శశాంక్ సింగ్ 25 బాల్స్ లో 3 సిక్సులు, 2 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. అశుతోస్ శర్మ 28 బంతుల్లో 7 సిక్సులు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. చివర్లో రబాడా వచ్చి ఒక సిక్స్ కొట్టి టెన్షన్ మరింత తగ్గించాడు.

కాకపోతే ఆఖరి ఓవర్ బుమ్రా వేశాడు. తను వేసిన మొదటి బంతికి షాట్ కొట్టి రెండో రన్ కోసం ప్రయత్నించి రబాడా రన్ అవుట్ అయిపోయాడు. దీంతో పంజాబ్ కథ, లక్ష్యానికి మరో 9 పరుగులు ముందు ఆగిపోయింది.

అదే వికెట్లు ఉండి ఉంటే, ముంబయిపై కచ్చితంగా పంజాబ్ విజయం సాధించేదని అందరూ అంటున్నారు. ఏదైనా ఎలాంటి దుస్థితి నుంచి ఎలాంటి స్థితికి పంజాబ్ వచ్చిందనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అందుకే అందరూ పంజాబ్ ఓడినా, పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నారు.

ముంబయి బౌలింగులో బుమ్రా 3, కొయెట్జీ 3, ఆకాష్ 1, హార్దిక్ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్లు పడగొట్టారు.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కి ఆదిలోనే దెబ్బ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ (8) అవుట్ అయ్యాడు. తర్వాత సూర్య కుమార్ వచ్చి తన మార్క్ ఇన్నింగ్స్ తో ధనాధన్ ఆడి, పంజాబ్ కి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ సిక్సులతో అలరించాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 25 బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: LSG vs CSK: చెలరేగిన రాహుల్.. సునాయాసంగా గెలిచిన లక్నో..

తర్వాత సూర్యకుమార్ 53 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్లతో 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా (10), టిమ్ డేవిడ్ (14), రొమారియో (1), మహ్మద్ నబీ (0) పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం 18 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

పంజాబ్ బౌలింగులో రబాడ 1, హర్షల్ పటేల్ 3, శామ్ కర్రన్ 2 వికెట్లు పడగొట్టారు.

ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 7వ స్థానానికి ఎగబాకింది. పంజాబ్ మాత్రం 9వ స్థానానికి పడిపోయింది.

Related News

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

Big Stories

×