Big Stories

Dubai Sky Turned Green: అదేంటి దుబాయ్‌లో ఆకాశం పచ్చరంగులోకి మారింది.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Dubai Sky Turned Green: ఎడారి ప్రాతంలో వర్షం కురవడం అంటేనే అదొక విచిత్రం. అలాంటిది ఒక సంవత్సరం పాటు కురిసే వర్షం అంతా కేవలం ఒక రోజులో గంటల వ్యవధిలోనే కురిసింది. తాజాగా దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. విపరీతమైన ఎండలతో మండిపోతున్న ఈ రోజుల్లో అకాల వర్షం కురవడం కారణంగా దుబాయ్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గత నాలుగు రోజులుగా దుబాయ్ వాసులు నీటిలోనే నివాసం ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులో తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.

- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే యూఏఈ విమానాశ్రయం కూడా నీట మునిగింది. భారీ ఈదురుగాలుల కారణంగా విమానలు కూడా నీట కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా దుబాయ్ వర్షాలకు సంబంధించిన మరొక వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

Also Read: Rains on Dubai: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

ఉన్నట్టుండి దుబాయ్ లోని ఆకాశం ఆకు పచ్చ రంగులోకి మారింది. నీలి రంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా పచ్చ రంగులోకి మారడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాలు, తుషాను, ఈదురు గాలుల కారణంగా ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారిందంటూ కొంతమంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ వర్షాల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News