Big Stories

Telangana CM : సీఎంగా రేవంత్ రెడ్డే ఎందుకు..? కారణాలివే..! 

Telangana new CM update

Telangana new CM update(Today news in telangana):

తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డికే రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి కాక సీఎం పదవికి అర్హులెవరు? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి.

- Advertisement -

ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్.. మూడు రాష్ట్రాల్లో ఓటమి చెందితే.. రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కానీ తెలంగాణలో మాత్రం అసాధ్యం సుసాధ్యం అయ్యింది. అత్యంత బలమైన కేసీఆర్‌ను ఢీకొట్టి అధికారం అందుకొంది కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీకి అధికారం అందడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైంది రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర. ఆ యాత్రతో కాంగ్రెస్‌ కేడర్‌లో నూతనోత్తేజం వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్‌ కేడర్‌ యుద్ధానికి సిద్ధమైంది. రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో చేపట్టిన జోడో యాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొని.. స్థానిక సమస్యలను అధినాయకత్వానికి తెలిసేలా చేశారు.

- Advertisement -

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం అనేదిమాములు విషయం కాదు. ఆ పొజిషన్‌లో ఎవరు ఉన్నా కేసీఆర్‌ ధాటికి కాస్తోకూస్తో వెనుకంజ వేసేవారు. కానీ రేవంత్‌రెడ్డి అలా కాదు.. కేసీఆర్‌ సై అంటే.. రేవంత్‌రెడ్డి డబుల్‌సై అన్న సందర్భాలను మనం చూశాం. ప్రచార సభలు, సమావేశాలు, రోడ్ షోలు, మీడియాతో ఇంటర్వ్యూలు ఇలా ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎక్కడ చూసిన రేవంత్ రెడ్డి మాత్రమే కనిపించాడు. ఒక్కడే సైన్యంగా మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలుపు బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం అలుపెరగకుండా పోరాటం చేశాడు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీని ఆయన పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వచ్చాయంటే అందుకు రేవంత్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో పార్టీకి లభిస్తున్న ఆదరణను ఓట్లుగా మార్చారు. ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలుగా ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా తెలంగాణపై దృష్టి పెట్టారు. అందులోభాగంగానే టైం దొరికినప్పుడల్లా రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. ఇక ప్రచార టైంలో అయితే ఇక్కడే మకాం వేశారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి తమవంతు బాధ్యతను నిర్వర్తించారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హత్‌సే హత్‌ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్‌ జోడో యాత్ర తర్వాత దీన్ని చేపట్టడం పెద్ద టాస్క్‌ అని చెప్పాలి. ఎందుకులే అనుకుంటే ఇవాళ కాంగ్రెస్‌కు అధికారమూ వచ్చేది కాదు. స్థానిక నాయకత్వాన్ని కలుపుకుంటూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ యాత్ర దిగ్విజయంగా పూర్తిచేశారు. అధికార బీఆర్ఎస్‌ యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా వాటిని చేధించుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి రాహుల్‌ తో పాటు రేవంత్‌ రెడ్డి చేపట్టిన యాత్రలు ఓ బిగ్‌ బూస్ట్‌ ఇచ్చాయన్నది వాస్తవం. దీన్ని ఎవరూ కాదనలేరు.

రెండుసార్లు అధికారం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఎన్ని గట్స్‌ ఉండాలి. ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. టీపీసీసీ చీఫ్‌ స్థానంలో రేవంత్‌ కాకుండా మరెవ్వరూ ఉన్న రాష్ట్రంలో అసలు కాంగ్రెస్‌ వేవ్‌ వచ్చి ఉండేదా? కేసీఆర్‌ను మాటకు మాట అనే వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా.. అంటే అది రేవంత్‌రెడ్డి మాత్రమే. మిగతా ఒకరిద్దరు నేతలు ఉండవచ్చు కానీ.. రేవంత్‌ రెడ్డి అంత అగ్రెసివ్‌గా దూసుకువెళ్లే తత్వంవారిలో లేదనే చెప్పుకోవాలి. పోలీసు కేసులతో బెదిరింపులకు దిగినా బెదరని నైజం అందుకే.. రేవంత్‌రెడ్డి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.


ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్‌ రెడ్డి దూకుడు ప్రదర్శించాడు. టీపీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థులను గెలిపించుకోవాల్సినబాధ్యత తనపై ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ప్రచారాన్ని తనదైన శైలిలో కొనసాగించారు. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్‌ అయ్యారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైతే పదిమెట్లు తగ్గుతా అన్నాడు రేవంత్‌రెడ్డి. అందుకుతగ్గట్టుగానే సీనియర్లను కలుపుకుంటూ ముందుకెళ్లాడు. ఆ తర్వాత పార్టీని వదిలివెళ్లిన కీలక నేతలను వాపస్‌ రప్పించడంపై ఫోకస్‌ పెట్టాడు. ముఖ్యనేతలుగా ఉన్న గడ్డం ప్రసాద్‌కుమార్‌, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చారు. అంతేకాదు వాళ్లకు టికెట్లు ఇప్పించి గెలిపించుకున్నారు.

కేసీఆర్‌ను ఢీకొట్టే లీడర్‌ రేవంత్‌రెడ్డి. ఇది కొద్దిరోజుల క్రితం విన్నప్పుడు చాలా మంది నమ్మని మాట. కానీ నవ్వులను రేవంత్‌ పట్టించుకోలేదు. సైలెంట్‌గా తన పనిచేసుకుంటూ వెళ్లాడు. ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టే లీడర్‌ ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. ప్రజలకు కూడా ఆ విశ్వాసం కల్పించాడు. తాను ఉన్నాననే సంకేతం జనాల్లోకి వెళ్లేలా రేవంత్‌ రెడ్డి ప్లాన్డ్‌గా ప్రతిదీ చేసుకుంటూ వచ్చాడు.

ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇటీవల జరిగిన పరిణామాలు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీచేస్తారని తెలియడంతో అధిష్టానం రేవంత్‌రెడ్డిని అక్కడ బరిలో దింపింది. అధిష్టానం ఆదేశాలను ధిక్కరించకుండా పోటీకి సై అన్నాడు. అక్కడ కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా రేవంత్‌.. రాష్ట్రమంతటా ప్రచారం చేస్తూనే కామారెడ్డిలో క్యాంపెయినింగ్‌ చేశారు. అయితే ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచాడు. కానీ నైతిక విజయం మాత్రం రేవంత్‌రెడ్డిదే. ఎందుకంటే ఒకవేళ అక్కడి నుంచి రేవంత్‌ పోటీ చేసి ఉండకపోతే కేసీఆర్‌ గెలిచేవాడని అనలిస్టులు చెబుతున్నామాట. గడచిన రెండు మూడు దశాబ్దలుగా ఓటమి ఎరుగని కేసీఆర్‌ను.. ఓడించింది మాత్రం రేవంత్రెడ్డి.

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. అలాంటి పార్టీని కాదని 2014లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించారు. ఆ తర్వాత 2018లోనూ రికార్డు మెజార్టీతో మరోసారి కేసీఆర్‌నే ఆదరించారు. ఇక అక్కడినుంచి కాదుకాదు అంతకుముందునుంచే కేసీఆర్‌ వ్యూహాలతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది. ఎంతలా అంటే తెలంగాణ అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే తెలంగాణ అనేంతలా పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాటన్నింటీ నుంచి బయటపడేసేలా కాంగ్రెస్‌ పార్టీలో జవసత్వాలునింపిందిమాత్రం రేవంత్‌రెడ్డి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంతేకాదు కాంగ్రెస్‌ బలమైన శక్తిగా మార్చి అధికారం అందించిన గొప్ప నేతగా నేడు రేవంత్‌ కీర్తించబడుతున్నాడు.

మొత్తంగా సీనియర్లు ఇప్పుడు సీఎం పోస్టుకు రేసులో మేం ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు. లాబీయింగ్‌ చేసుకోవచ్చుకానీ.. ఎవరివల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది అన్నది మేటర్‌ ఇక్కడ. ఈ విషయం అటు హైకమాండ్‌కు,.. ఇటు రాష్ట్ర ప్రజలకు క్లియర్‌ కట్‌గా తెలుసు. ఇప్పుడు గనక సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ తరహాలోనే పార్టీ దెబ్బ తినవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయాన్నే హిందుస్థాన్ టైమ్స్‌ తన ఎడిటోరియల్ పేజ్‌లో విశ్లేషించింది. ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడానికి కారణాలను స్పష్టంగా చెబుతూ.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి లాంటి లీడర్ ఉండడం వల్లే విజయం సాధ్యమయ్యిందంటూ చెప్పుకొచ్చింది.

రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే అన్ని వర్గాలు సంతోషిస్తాయన్నది సీనియర్ జర్నలిస్టులు, రీసెర్చ్‌ ఫెల్లోస్‌ మాట. అలా హిందూస్తాన్‌ టైమ్స్‌లో ఓ ఆర్టికల్‌ను ప్రచురించారు. ఆ ఆర్టికల్‌ను చదివితే మీకే తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయానికి రేవంత్‌రెడ్డి ప్రధాన కారకుడు అయ్యాడని అందులో రాశారు. అన్ని విషయాల్లోనూ రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సమర్థవంతంగా ముందుకు వెళ్లిందని గుర్తుచేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు రేవంత్‌రెడ్డి. అందరిని కలుపుకుని చివరికి తనను విభేధించే సీనియర్లతో సైతం సఖ్యతగా మెలిగి ముందుకెళ్లాడు. కేసీఆర్‌ పాలనలో అంధకారంలో చిక్కుకుపోయిన యువతలో రేవంత్‌రెడ్డి ధైర్యాన్ని నింపాడని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడని మేధావులు రేవంత్‌ను కీర్తిస్తున్నారు.

కాంగ్రెస్‌ పాత ముఖాలకు స్వస్తి పలికి కొత్తవారిని ప్రోత్సహించాలని.. అప్పుడే ప్రజల్లో పార్టీపై ఓ నమ్మకం ఏర్పడుతుందని భావించిన రేవంత్‌రెడ్డి అదే స్ట్రాటజీని వర్కవుట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. కొత్తవారికి అవకాశం ఇచ్చే విధంగాకాంగ్రెస్‌ అడుగులు ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకు ఉదహరణగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రిజల్ట్స్‌ను పోల్చి చూసుకోవాలంటున్నారు. వెటరన్లతో లాభం లేదనే విషయాన్ని గ్రహించాలంటున్నారు. అశోక్‌ గెహ్లాట్‌, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌ లాంటి సీనియర్ల నాయకత్వంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమిపాలైంది. ఇలా డీటెయిల్డ్‌ అనలాసిస్‌ను ప్రముఖ ఇంగ్లీష్‌ దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ ప్రచురించింది.

ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ పేరు కాకుండా వేరే ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్‌లో దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తే.. మళ్లీ తర్వాత జరిగే పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో మున్ముందు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుమీద నడక అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News