Big Stories

VOTER ID : ఓటర్ ఐడీ లేదా.. డోంట్ వర్రీ.. ఈ ఐడెంటిటీ కార్డులతో ఓటెయొచ్చు

VOTER ID

VOTER ID : తెలంగాణలో ఓట్ల పండు మొదలైంది. ఓటర్లంతా ఓటేసేందుకు పోలింగ్ బూత్ లకు తరలుతున్నారు. ఇంకా మీ ఇంటికి ఓటర్‌ స్లిప్పులు రాలేదా.. అయితే డోంట్‌ వర్రీ. వాస్తవానికి ఎన్నికల సంఘం ద్వారా మాత్రమే పోలిం గ్‌ స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఓటర్లను ఆకర్షించే క్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులు పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగానే.. అటు అభ్యర్థులు, ఇటు ఎన్నికల సంఘం కూడా పోలింగ్‌ స్లిప్పులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో, తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఓటర్లు నానా అగచాట్లు పడ్డారు.

- Advertisement -

మొబైల్‌ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే ముందే ఓటర్లు తాము ఓటు వేయాల్సిన బూత్‌ ఎక్కడుందో సమగ్రంగా తెల్సుకోవాలి. గతంలో వేశాములే అదే పోలింగ్‌ బూత్‌ అయి ఉంటుంది అనే ధీమాను పక్కనబెట్టి.. కచ్చితంగా ఈ సారి కూడా పోలింగ్‌ బూత్‌ ఎక్కడ ఉందో ముందే తెలుసుకోండి. దానివల్ల అటు ఇటు తిరగడం లాంటి తిప్పలు తప్పుతాయి. మీ ఓటరు గుర్తింపు కార్డు నంబరును 1950, 92117-28082 నెంబర్లకు కాల్ చేసి చెబితే.. పోలింగ్‌ కేంద్రం వివరాలు SMS రూపంలో వస్తాయి. 24 గంటలు పనిచేసే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఎలక్షన్‌ కమిషన్‌కు చెందిన ఓటరు హెల్ప్‌ లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా డీటెయిల్స్‌ పొందవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు వెబ్‌సైట్‌లోనే ఆస్క్‌ వోటర్‌ సహాయ మిత్ర చాట్‌బాట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

ఓటర్ స్లిప్పు లేని పక్షంలో ఏదైనా కేవైసీ డాక్యుమెంట్ చూపించి ఓటు వేయవచ్చు. ఎపిక్‌, ఆధార్‌ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం , పాన్‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు జాబ్‌కార్డును ప్రూఫ్ ఆప్ ఐడెంటిటీగా వాడుకోవచ్చు. లేదా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వీటిల్లో ఏదైనా గుర్తింపు పత్రంగా చూపించొచ్చు. మీ ఓటు హక్కును వినియోగించవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News