Big Stories

Politicians Tweets: తెలంగాణలో పోలింగ్.. ఓటర్లకు ప్రియాంక గాంధీ, మోదీల సందేశాలు

Politicians Tweets: తెలంగాణలో ఓటర్ల పండుగ మొదలైంది. ఓటర్లంతా ఓటరు స్లిప్పులు, ఐడెంటిటీ కార్డులు చేతపట్టి ఓటు అనే ఆయుధంతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పే కీలకం కానుంది. 18-39 ఏళ్లలోపు ఓటర్లే అధికంగా ఉన్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మంత్రి కేటీఆర్ తదితరులు ఓటర్లునుద్దేశించి X వేదికగా సందేశాలు పంపారు.

- Advertisement -

తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులంతా రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా తొలిసారి ఓటేస్తున్న యువత.. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సాధికారతే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలంటూ అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

వచ్చే ఐదేళ్లపాటు మీ భవిష్యత్ ను నిర్ణయించేది మీ ఓటేనని, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటూ కీలకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఓటర్లు.. ముఖ్యంగా తొలిసారి ఓటుహక్కు వచ్చినవారు ఓటు ఆయుధాన్ని వాడాలని విజ్ఞప్తి చేశారు.

మీ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ ప్రియమైనవారు తమ జీవితాలను త్యాగం చేసిన మాతృభూమి కోసం ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండని X లో ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News